Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లారాజకీయం

పంచాయతీ కార్మికుల మళ్లీ సమ్మె నోటీసు 

పంచాయతీ కార్మికుల మళ్లీ సమ్మె నోటీసు 

దమ్మపేట, మన సాక్షి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల 31 గ్రామపంచాయతీ కార్మికులు ఈ రోజున మండల పరిషత్ అధికారి కి రేపు అక్టోబర్ రెండో తారీకు నుండి సమ్మెలో భాగంగా ఈ రోజున సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది.

.ఈ సందర్భంగా ఏఐటీయూసీ అనుబంధ పంచాయతీ కార్మికుల యూనియన్ నాయకులు గొర్రెపాటి బసవయ్య, ఏఐటీయూసీ మండల కార్యదర్శి బెజవాడ రాము, సిపిఐ మండల సహాయ కార్యదర్శి సుంకుపాక ధర్మ మాట్లాడుతూ.. గతంలో పంచాయతీ కార్మికులు 34 రోజుల సమ్మె చేస్తుండగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు హామీతో సమ్మెను తాత్కాలికంగా విరమించినారు.

ALSO READ : జగన్ కు శుభాకాంక్షలు చెప్పిన లోకేష్.. ఎందుకో తెలుసా..!

ఆ రోజున మంత్రి ముఖ్యమంత్రి తో మాట్లాడి మీ డిమాండ్లను అమలుపరిచే దిశగా నేను పని చేస్తానని తెలిపినాడు కానీ నేటి వరకు కూడా పంచాయితీ కార్మికుల గురించి మంత్రివర్యులు గాని ముఖ్యమంత్రి గానీ పట్టించుకున్న దక్కాళ్ళు లేవు.

అందులో భాగంగా అక్టోబర్ 2 నుండి మళ్ళా సమ్మెను కొనసాగించాలని జేఏసీ పిలుపులో భాగంగా సమ్మెకు సంసిద్ధమవుతున్న దమ్మపేట మండల 31 గ్రామపంచాయతీ కార్మికులు. ఈ కార్యక్రమంలో తిమ్మరాజు, అన్నవరం, సింగు రామకృష్ణ, పెరుమళ్ళ రాంబాబు ,నాగమణి, ఉదయ్ , జ్యోతి, నాగు జేమ్స్ తదితర పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు .

ALSO READ : Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!

మరిన్ని వార్తలు