TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్

Ration Cards : రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం.. ఇవీ అర్హతలు..!

Ration Cards : రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం.. ఇవీ అర్హతలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కొత్త రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసరపరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రి మండలి సబ్ కమిటీ మార్గదర్శకాలను జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు జారీ చేసేందుకు నిర్ణయించింది. అందుకుగాను పాత రేషన్ కార్డుల స్థానంలో కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయించింది. అదేవిధంగా కొత్తగా దరఖాస్తులు చేసుకునే అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

అర్హతలు : 

కొత్త రేషన్ కార్డులు పొందేందుకుగాను గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం లక్షన్నర రూపాయలు, మాగాణి 3.20 ఎకరాలు, మెట్ట 7.2 0 ఎకరాలుగా నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి వార్షిక ఆదాయం రెండు లక్షల రూపాయలు నిర్ణయించారు.

అదేవిధంగా పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి త్వరలోనే విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు కమిటీ వెల్లడించింది. ఒక కుటుంబానికి ఒకే రేషన్ కార్డు ఉండాలని కమిటీ నిర్ణయించింది.

ALSO READ : 

Viral News : ఏడవ తరగతి కుర్రాడి లీవ్ లెటర్.. చదివితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!

TGSRTC : నాగార్జునసాగర్ టూర్ వెళ్తున్నారా.. ఆర్టీసీ కీలక ఆఫర్..!,

Krishna Floods : కాసులు కురిపిస్తున్న కృష్ణా నది వరద..!

Viral : హాజరు వేయాలంటే ముద్దు ఇవ్వాలి.. తోటి ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయుడు వీడియో కాల్.. (Video)

మరిన్ని వార్తలు