తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

శేషభట్టర్ లక్ష్మణమూర్తికి దైవజ్ఞరత్న బిరుదు అవార్డు

శేషభట్టర్ లక్ష్మణమూర్తికి దైవజ్ఞరత్న బిరుదు అవార్డు

శాలిగౌరారం, మనసాక్షి :

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితుడు డాక్టర్ శేషభట్టర్ లక్ష్మణమూర్తి విశిష్ట దైవజ్ఞరత్న బిరుదు అందుకున్నారు. లక్ష్మణమూర్తి గతంలో జ్యోతిష్యoలో పలు వార్డులు, బిరుదులు, సన్మానాలు పొందారు.అఖిల భారతీయ బ్రాహ్మణ మహా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కడప జిల్లా గండి క్షేత్రంలో గత నాలుగు రోజులు గా అఖిల భారత పంచాంగకర్తల విద్వత్ సభలు నిర్వహించారు.

ఈ సభల ముగింపు రోజున డాక్టర్ శేషభట్టర్ లక్ష్మణమూర్తిని సిద్ధాంతి విభాగం లో దైవజ్ఞరత్న బిరుదు తో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్రీయ సాంస్కృత విద్యాపీఠ కులపతి జిఎస్ కృష్ణమూర్తి, అఖిల భారత బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ, శ్రీశైలం దేవస్థాన ఆస్థాన పంచాంగ సిద్ధాంతి బట్టి వీరభద్రం, సింహాచలం ఆస్థాన సిద్ధాంతి తెన్నేటి శ్రీనివాస్, కాణిపాకం ఆస్థాన సిద్ధాంతి శివ స్వామి, ప్రముఖ వేదస్మార్మ ఆగమ పంచాంగ సిద్ధాంతి బివీస్, రాష్ట్రపతి సన్మానితులు సంస్కృతిక పండితులు ఎస్ టి జి రంగాచార్యులు తదితరులు ఉన్నారు.దైవజ్ఞరత్న బిరుదు పొందిన శేషభట్టర్ లక్ష్మణమూర్తిని పలువురు అభినందించారు.

ALSO READ : 

Srisailam : కృష్ణమ్మ పరవళ్ళు.. శ్రీశైలంకు 3.26 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. Latest Update

రైతులకు రుణమాఫీ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలి.. అదనపు కలెక్టర్ ఆదేశం..!

District collector : 82,593 మందికి రైతు కుటుంబాలకు రుణమాఫీ.. జిల్లా కలెక్టర్..! 

నల్గొండ జిల్లాలో బహిరంగ ప్రదేశాలలో మద్యపానం.. కొరడా జులిపించిన పోలీసులు..! 

మరిన్ని వార్తలు