Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణమహబూబాబాద్ జిల్లావ్యవసాయం

Telangana : అయ్యో అన్నదాతా.. అలుముకున్న కరువుఛాయలు…!

Telangana : అయ్యో అన్నదాతా.. అలుముకున్న కరువుఛాయలు…!

ఎండుతున్న వాగులు వంకలు.. నెర్రెలు బారిన పంట పొలాలు..!

మండలంలోని గ్రామాల్లో అలుముకున్న కరువుఛాయలు…!

పశువుల తాగునీటికి తప్పని తిప్పలు..!

ఎండిన పంటలతో.. ఆందోళనలో రైతన్నలు…!

చిన్న గూడూరు, మన సాక్షి:

గ్రామాల్లో ఉండే వాగులు, వంకలు అప్పుడే ఎండిపోయాయి. ఒకప్పుడు పశువులకు తాగునీరు అందించి, పశుగ్రాసం పండేందుకు అనుకూలంగా ఉన్న ఆయా గ్రామాల వాగులు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రం తో పాటు ఉగ్గంపల్లి, పగిడిపల్లి,విస్సంపల్లి,జయ్యరం,మన్నే గూడెం, తదిదర గ్రామాల గుండా ప్రవహించే ఆకేరు వాగు వేసవి మొదట్లోనే ఎండి పోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో నడి వేసవి లోనూ పశువులకు నీరందించడమే కాక, గ్రామ ప్రజలకు ఆయా తాగు ,సాగు నీటి అవసరాలు తీర్చేవి. ప్రస్తుతం ఆ వాగు పూర్తిగా ఎండిపోవడంతో గ్రామాల్లో పశువులకు తాగునీరు దొరకక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : Telangana New Ration Cards Process : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జారీ అప్పటి నుంచే..!

ఎండిపోయిన పంటలు..?

ఆయా గ్రామాల రైతులు ముఖ్యంగా ఆకేరు పరిసర ప్రాంతాలలో పంట సాగు చేసే రైతులు ఆకే రు వాగు పై ఆధార పడి పంట సాగు చేస్తూ జీవనం సాగిస్తారు ద్వారా ప్రతి సంవత్సరం పంటలు పండించేవారు. ఈసారి కూడా ఎప్పటిలాగే వరి సాగుచేసినప్పటికీ సరైన నీరు లేక గ్రామాల సరిహద్దు లోని వాగు ఎండిపోయి.

వేసవి మొదట్లోనే భూగర్భ జలాలు అడుగంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఆ వాగు కింద సాగుచేసిన పంటలు కూడా ఏమాత్రం చేతికి వచ్చే పరిస్థితి కనిపించటం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో పశువులకు గ్రాసం కూడా కరువై పాడి రైతులు పశువులను అమ్ముకునే పరిస్థితి ఎదురైందని సగటు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : Irregularities in PACS : సూర్యాపేట జిల్లా చిల్లేపల్లి సహకార సంఘంలో రూ.2 కోట్ల అక్రమాలు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిరసన..!
వేసవి మొదట్లోనే ప్రమాద ఘంటికలు…!

మండలంలో ఇప్పటికే కరువుఛాయలు అలుముకున్నాయి. చిన్న గూడూరు మండలంలో ఆకేరు పరిసర ప్రాంత రైతులు మునుపెన్నడూ లేని నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఆకేరు వాగు కింద నీటి లభ్యత ఉన్న సమయంలో వరి పంటతో పాటు ఇతర పంటలు మరియూ పశుగ్రాసం, మరికొందరు కూరగాయలు సాగు చేసుకునేవారు. ప్రస్తుతం భిన్న పరిస్థితి నెలకొంది. వాగు మొత్తం ఎండిపోయి ఎడారిని తలపిస్తుంది. ఈ వాగు ఎండిపోవడంతో మండల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి కాలువల ద్వారా నీటిని విడుదల చేసి పంట పొలాలను రక్షించాలని కోరుతున్నారు.

ALSO READ : Good News : ఇసుక రవాణా పై ప్రభుత్వం గుడ్ న్యూస్..!

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు