Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిరాజకీయం

Shankarpally : శంకర్‌పల్లిలో బిజెపికి బిగ్ షాక్..!

శంకర్‌పల్లి మున్సిపల్ లో బిజెపికి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో రంగారెడ్డి జిల్లా బిజెపి కౌన్సిల్ సభ్యుడు సీనియర్ నాయకుడు, 14వ వార్డుకు చెందిన వాసుదేవ్ కన్నా, 12వ వార్డుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి, 13వ వార్డుకు చెందిన ఆఫ్సర్, బుల్కాపూర్, గాజులగూడకు చెందిన వివిధ పార్టీల నాయకులు సోమవారం బిఆర్ఎస్ లో చేరారు.

Shankarpally : శంకర్‌పల్లిలో బిజెపికి బిగ్ షాక్..!

వెన్నుపోటు రాజకీయాలు మానుకోండి.. సబితా ఇంద్రారెడ్డి

శంకర్‌పల్లి, (మన సాక్షి):

శంకర్‌పల్లి మున్సిపల్ లో బిజెపికి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో రంగారెడ్డి జిల్లా బిజెపి కౌన్సిల్ సభ్యుడు సీనియర్ నాయకుడు, 14వ వార్డుకు చెందిన వాసుదేవ్ కన్నా, 12వ వార్డుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి, 13వ వార్డుకు చెందిన ఆఫ్సర్, బుల్కాపూర్, గాజులగూడకు చెందిన వివిధ పార్టీల నాయకులు సోమవారం బిఆర్ఎస్ లో చేరారు.

పార్టీలో చేరిన వారికి మహేశ్వరం ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ విధి, విధానాలు నచ్చే పార్టీలో చేరుతున్నారని ఆమె అన్నారు. చేవెళ్ల గడ్డ ఎప్పటికీ ఇంద్రారెడ్డిదే అని చెప్పారు.

కార్యకర్తలు ఏ సమయానికి నాకు కాల్ చేసిన మీ ముందు క్షణాల్లో వాలిపోతానని భరోసా ఇచ్చారు. నేను మీ మనిషిని, అందరూ కలిసికట్టుగా పనిచేయండి భవిష్యత్తు మనదే అని పేర్కొన్నారు. గ్రామాల్లో సాయంత్రం అయ్యేసరికి రైతుల పొలాల్లో కరెంటు కట్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు.

నెలలు గడుస్తున్న రైతులకు రైతుబంధు వేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఉట్టివేనని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు.
కెసిఆర్ మళ్లీ సీఎం కావాలని అందరి కోరిక అని బదులిచ్చారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఇంకా నాలుగు వార్డులు గెలిచే వాళ్ళమని, వెన్నుపోటు రాజకీయాల వల్ల కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయామని తెలిపారు.

రానున్నది మన ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. నాయకులంతా కార్యకర్తలతో సమన్వయంగా మెలిగి పార్టీకి పూర్వ వైభవం తేవాలని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఏఎంసి చైర్మన్లు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు