Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Mudivedu : ముదివేడు ప్రొబేషన్ ఎస్ఐగా శ్రావణి.. ఎవరో తెలుసా..!

Mudivedu : ముదివేడు ప్రొబేషన్ ఎస్ఐగా శ్రావణి.. ఎవరో తెలుసా..!

మదనపల్లి, మన సాక్షి:

ముదివేడు పోలీస్ స్టేషన్ ప్రొబేషన్ నూతన ఎస్ఐగా పి. శ్రావణి శుక్రవారం నియమితులయ్యారు. 2024 బ్యాచ్ కు చెందిన ఈమె ఎస్ఐ పోస్టుకు ఎంపికయ్యారు. తొలుత మదనపల్లె రూరల్ స్టేషన్ లో మూడు నెలల పాటు శిక్షణలో భాగంగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.

ఈ క్రమంలో విధినిర్వహణలో ఆమె ప్రశంసలు పొందారు. ఇప్పుడు ముదివేడు స్టేషన్ ప్రాబేషన్ ఎస్ఐగా నియమితులయ్యారు. స్టేషన్ కు ఇద్దరు ఎస్ఐలు ఉన్న నేపద్యంలో వివిధ సేవల్లో వేగం, నిబద్దత ఉండగలదని భావిస్తున్నారు.

శాంతి భద్రతల సంరక్షణ ఇతర వివిధ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో తన వంతు కృషి చేయగలరని భావిస్తున్నారు. చురుకైన ఈమె ప్రజల్లో మమేకమై చొచ్చుకుపోగలరని మండల ప్రజలు ఆశిస్తున్నారు.

MOST READ : 

  1. Nalgonda : బిసి రిజర్వేషన్లపై హైకోర్టు స్టే కు నిరసన.. బీసీ సంఘాల రాస్తారోకో..!

  2. Paddy : వరి లో డ్రం సీడర్, వెదజల్లే పద్ధతులపై బెంచ్ మార్క్ శాస్త్రవేత్తల సర్వే..!

  3. Paddy : వరి పంటకు సుడిదోమ, కంకినల్లి నివారణ.. పిచికారి చేయాల్సిన మందులు..!

  4. Garlic : వెల్లుల్లి తింటే కలిగే అద్భుత ఆరోగ్య లాభాలు.. ఏ సమయంలో తినాలో తెలుసా..! 

మరిన్ని వార్తలు