Nalgonda : శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం..!
Nalgonda : శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం..!
కనగల్, మన సాక్షి :
భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం(పర్వతగిరి) శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ నూతన పాలకమండలి ధర్మకర్తలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దర్వేశిపురం – పర్వతగిరి గ్రామాలకు చెందిన 11 మంది ధర్మకర్తలతోపాటు చైర్మన్ అమ్మవారి సన్నిధిలో ప్రమాణం చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ దర్వేశిపురం పరిధి మంచినీళ్ల బావికి చెందిన చీదేటి వెంకట్ రెడ్డి ఆలయ చైర్మన్ గా ప్రమాణం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. దర్వేశిపురంకు చెందిన ధర్మకర్తలుగా రాయల వెంకటయ్య, జినుకుంట్ల నవీన్, కంచరకుంట్ల శంకర్ రెడ్డి, చనగోని నగేష్, నాగోజు రమేష్ చారి, నరాల బాబు, పర్వతగిరికి చెందిన నకిరెకంటి రాజు, కొప్పుల నరేష్, కోట్ల దుర్గమ్మ, నెలగొందరాశి అంజయ్య, బొమ్మ సైదులు ప్రమాణం చేశారు. ఆలయ ఎక్స్ అఫీషియో మెంబర్ గా నాగోజు మల్లాచారి ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుమ్మల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి, కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ బిక్షం యాదవ్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ దేవి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో జల్లేపల్లి జయరామయ్య, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సుమతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నెలగొందరాసి ముత్తయ్య, నరసింహ, ఆలయం సిబ్బంది జినుకుంట్ల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Gold Price : హ్యాట్రిక్ కొట్టేసిన గోల్డ్.. ధర ఎంతో తెలుసా..!
-
Miryalaguda : మోస్ట్ వాంటెడ్.. ఈ దొంగల ఆచూకీ చెబితే రివార్డ్.. మిర్యాలగూడ పోలీసుల ప్రకటన..!
-
Scam : డబ్బులు వచ్చాయని సంబరపడి ఎకౌంట్ చెక్ చేసుకుంటే.. కొత్త రకం స్కాం, వెంటనే తెలుసుకోండి..!
-
Gold Price : బంగారు ఆభరణాలు ఇక చౌక.. కేంద్రం సంచలన నిర్ణయం..!









