Sixth class student : ఆరో తరగతి విద్యార్థిని మృతి.. విచారణ చేపట్టిన ఐటిడి అధికారులు..!
Sixth class student : ఆరో తరగతి విద్యార్థిని మృతి.. విచారణ చేపట్టిన ఐటిడి అధికారులు..!
మెలియాపుట్టి. మనసాక్షి:
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలోని భరణికోట గ్రామానికి చెందిన ఆరవ తరగతి విద్యార్థి బుధవారం మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు.
అయితే విద్యార్థిని నందిని భరణికోట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 10వ తేదీన అనారోగ్య కారణంగా ఇంటికి వెళ్ళింది. పలాస ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం ఎటువంటి ఇబ్బంది లేదని వైద్యం తెలియజేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అక్కడినుంచి ఉల్లాసంగా ఉన్న విద్యార్థినికి మంగళ వారం రాత్రి వాంతులు అధికంగా అయి.. అస్వస్థతకు గురై బుధవారం వేకువ జామున ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయం పై ఏటీడబ్ల్యూ శ్రీనివాసరావు వెంటనే విచారణ చేపట్టారు. మృతికి గల పూర్తి వివరాలు కారణాలు తెలుసుకొని అధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులు మృతి చెందడంతో మామయ్య వెంకటరావు సంరక్షణలో ఉంటూ చదువుకుంటున్నట్లు పలువురు.. చెబుతున్నారు.









