TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

SLBC : ఎస్ఎల్బీసి సొరంగం పూర్తి కి రూ.460 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేషన్..!

SLBC : ఎస్ఎల్బీసి సొరంగం పూర్తి కి రూ.460 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేషన్..!

ఎట్టి పరిస్థితుల్లో డిండి ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేస్తాం

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

దేవరకొండ /చింతపల్లి/ మన సాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు, ఎస్ ఎల్ బి సి సొరంగం పనులనుపూర్తి చేసి తీరుతామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.

నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన ముందుగా అడవిదేవులపల్లి మండలం ,చిట్యాల వద్ద దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం పై సమీక్షించి,అనంతరం హెలికాప్టర్లో డిండి చేరుకొని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం తో పాటు, మునుగోడు ఇతర నియోజకవర్గాలలో చేపట్టిన ప్రాజెక్టుల పనులపై జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, స్థానిక శాసనసభ్యులు బాలు నాయక్, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తమ ప్రభుత్వ హాయంలో ఎట్టి పరిస్థితులలో ఎస్ ఎల్ బి సి సొరంగం పనులను , డిండి ప్రాజక్ట్ ను పూర్తిచేస్తామని అన్నారు. ఎస్ ఎల్ బి సి టన్నెల్ నిర్మాణంలో ఒక వైపు నుంచి ఒక రకమైన సమస్య ఉంటే మరోవైపు నుంచి ఇంకో సమస్య ఉందని, అయినప్పటికీ సమస్యలన్నీ తీరుస్తూ ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

ఎస్ ఎల్ బి సి సొరంగ మార్గం పూర్తి చేయడానికి 460 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేషన్స్ వేసి మంజూరుకు క్యాబినెట్ ముందుకు తీసుకెళ్ళామన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా మూడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడానికి ముందుకు వెళ్తున్నామని తెలిపారు.దేవరకొండ నియోజకవర్గం లో మంజూరై ఉన్న అంబాభవాని, కంబాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పూర్తి చేస్తామని చెప్పారు.

దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో డిండి ,ఎస్ఎల్బీసీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. సింగరాయపల్లి ప్రాజెక్టుకు 119 కోట్లు మంజూరు అయ్యాయని, 93 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని ,80 శాతం పనులు పూర్తయ్యాయని ,కేవలం 20% పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నందున వెంటనే వాటిని పూర్తి చేయాల్సిందిగా మంత్రికి విజ్ఞప్తి చేశారు.

గొట్టిముక్కల ప్రాజక్ట్ దాదాపు పూర్తయిందని, మూడున్నర ఎకరాలకు సంబంధించి భూసేకరణ సమస్య ఉందని, అలాగే రోడ్డు సమస్య ఉందని వాటిని పరిష్కరించాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చింతపల్లి రిజర్వాయర్ భూ సేకరణ సమస్య వల్ల పనులు ముందుకు సాగట్లేదని తెలుపగా
మంత్రి మాట్లాడుతూ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించారు.

అదేవిధంగా చింతపల్లి రిజర్వాయర్లో భూమి కోల్పోతున్న రైతుల సమస్యలను సైతం మానవతా దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలన్నారు .డిండి లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్ఎల్బిసి పనులపై ప్రతి నెల సమీక్షించాలని శాసనసభ్యులు మంత్రికి విజ్ఞప్తి చేశారు.

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన , కిష్టరాంపల్లి, చర్లగూడెం రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇబ్రహీంపట్నం వద్ద భూ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.
ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గమని, ఎస్ ఎల్ బి సి, డిండి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చెప్పడం చాలా అభినందనీయమని అన్నారు.

డిండి ఎత్తి పోతల పథకంలో కిష్టరాంపల్లి, చర్ల గూడెం ప్రాజెక్టులు చాలా పెద్దవని,ఈ రెండు ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు 2018 లో 4 మరియు 5 లక్షలు మాత్రమే పరిహారం అందిందని, కనీసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో న్యాయం చేయాలన్నారు.

ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద మునుగోడు నియోజకవర్గంలో ఆయకట్టును మరో 20000 ఎకరాలకు పెంచాలని మంత్రిని కోరారు. పునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిలాయి పల్లి కాలువ స్థిరీకరణను పెంచాలని కోరారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అనిల్, నల్గొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

MIRYALAGUDA : మిర్యాలగూడకు కొత్తగా ఒక ఎత్తిపోతల, 3 చెక్ డ్యాములు మంజూరు..!

Miryalaguda : ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది.. జిల్లా కలెక్టర్

మిర్యాలగూడ : అమావాస్య, వేప చెట్టు కింద మంత్రించిన కొబ్బరికాయలు, భయాందోళనలు.. రంగంలోకి జన విజ్ఞాన వేదిక..!

Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!

మరిన్ని వార్తలు