Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Kanagal : రోడ్డు ప్రమాదంలో కొడుకు దుర్మరణం.. తండ్రి పరిస్థితి విషమం..!

Kanagal : రోడ్డు ప్రమాదంలో కొడుకు దుర్మరణం.. తండ్రి పరిస్థితి విషమం..!
కనగల్, మన సాక్షి :
నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలోని బ్రిడ్జి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందగా తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. కనగల్ ఎస్సై రాజీవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…
మధ్యాహ్నం సమయంలో యేకుల త్రివేను అతని కుమారుడు యేకుల రూపజ్ లు బైక్ పై కొండమల్లేపల్లి వైపు వెళుతుండగా కనగల్ బ్రిడ్జి వద్ద ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రూపజ్ (10) బైక్ పైనుంచి కింద పడి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
ఇదే ప్రమాదంలో త్రివేణుకు సైతం తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుకు తీవ్ర గాయాలై కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. మృతుడి తల్లి సుమలత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
MOST READ :
-
Suryapet : మీ మొబైల్ ఫోన్ పోయిందా.. CEIR పోర్టల్ లో నమోదు చేస్తే చాలు దొరికినట్టే..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ధాన్యం సేకరణలో అక్రమాలు, ఇద్దరు సస్పెండ్..!
-
Nalgonda : జిల్లా ఎస్పీ కీలక సూచన.. ర్యాగింగ్ భూతాన్ని కళాశాల నుండి తరిమివేయాలి..!
-
Alumni : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. 17 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు..!









