Suryapet : డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్..!

Suryapet : డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్..!
సూర్యాపేట, మనసాక్షి :
గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ జిల్లా కేంద్రం సహా అన్ని పోలీసు స్టేషన్ ల పరిధిలో మద్యంతాగి వాహనాలు నడుపుతున్న వాహనదారులపై స్పెషల్ డ్రైవ్ ద్వారా 1509 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగినది జిల్లా ఎస్పి నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు.
15 మందికి జైలు శిక్షల పడగా మొత్తం కేసుల్లో రూ.5 లక్షల 41 వేలు కోర్టుల నందు జరిమానా కట్టించడం జరిగిందన్నారు. మద్యంతాగి వాహనాలు నడుపుతున్న వారిపై సూర్యాపేట డివిజన్ పరిధిలో 957 కేసులు, కోదాడ డివిజన్ పరిధిలో 552 కేసులు నమోదు చేశామన్నారు.
మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదం, నేరం అందుకు జైలు శిక్షలు, జరిమానాలు తప్పవు అని హెచ్చరించారు. వానదారులు మద్యం తాగి వాహనం నడపడం ద్వారా పత్యక్షంగా కాని, పరోక్షంగా కాని రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నరు, మధ్యంతాగి వాహనం నడిపినవారు సైతం మృత్యువాత పడుతున్నారనీ ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అన్నారు.
ఇది దృష్టిలో ఉంచి జిల్లా వ్యాప్తంగా మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిదన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు పటిష్టంగా నిర్వహిస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో పట్టుబడిన వాహనదారులకు ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో న్యాయమూర్తి ఎదుట పర్చడం ద్వారా వాహనదారులకు కోర్టులో జైలు శిక్షలు, జరిమానా విధించడం జరుగుతుందన్నారు.
వాహన దారులు కుటుంబాలను దృష్టిలో వుంచుకొని మద్యం సేవించి వాహనం నడపవద్దని, తప్పిదాలతో ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయినవారు, అంగవైకల్యంగా జీవితాలను కొనసాగిస్తూన్నారని, ఇకనైన వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, వాహనదారులు తమ గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు.
MOST READ :
-
District Additional Collector : జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు.. విద్యార్థులకు వాటి పట్ల పూర్తి అవగాహన కల్పించాలి..!
-
Nagarjuna Sagar : పెరుగుతున్న నాగార్జునసాగర్ జలాశ నీటిమట్టం..!
-
TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. సర్కార్ నిర్ణయం ఇదే..!
-
KTR : కేటీఆర్ సంచలన సవాల్.. ప్లేస్, టైం, డేట్ అన్ని సీఎం రేవంత్ ఇష్టమే.. ఎప్పుడైనా రెడీ..!









