Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతరలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

నెల్వలపల్లి లో ముగిసిన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు

చింతపల్లి మండల పరిధిలోని నెల్వలపల్లి గ్రామంలో గ్రామంలో గత వారం రోజుల నుండి జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి.

నెల్వలపల్లి లో ముగిసిన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు

చింతపల్లి, మన సాక్షి :

చింతపల్లి మండల పరిధిలోని నెల్వలపల్లి గ్రామంలో గ్రామంలో గత వారం రోజుల నుండి జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పూజారి నర్రాముల జంగయ్య మాట్లాడుతూ గ్రామంలో ఆదివారం స్వామివారి రధాన్ని యువకులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా లాగారు.

ఈ రథోత్సవ కార్యక్రమం సందర్భంగా వివిధ వేషధారణ, కోలాటం ఇక్కడికి విచ్చేసిన భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరై గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.

.గ్రామంలోని మాకు ఇదే పెద్ద పండుగ అని ప్రతి ఇంట పండగ వాతావరణం కనిపించిందన్నారు. ఈ దేవాలయానికి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ప్రతి ఏటా స్వామివారి ఉత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవ్వేతంగా కన్నుల పండుగగా నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ప్రముఖులు స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో వేద పండితులు గొట్టిముక్కల నరసింహ శర్మ ఉత్సవ కమిటీ నిర్వాహకులు గ్రామ పెద్దలు, స్థానిక సర్పంచ్, ఆవుల రాజేశ్వరి మల్లయ్య, ఉప సర్పంచ్ నాగయ్య, వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలు భక్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు