Miryalaguda : రాష్ట్రస్థాయి డిస్కస్ త్రో పోటీలకు సెయింట్ జాన్స్ విద్యార్థిని..!
Miryalaguda : రాష్ట్రస్థాయి డిస్కస్ త్రో పోటీలకు సెయింట్ జాన్స్ విద్యార్థిని..!
మిర్యాలగూడ, మన సాక్షి :
రాష్ట్రస్థాయి డిస్కస్ త్రో పోటీలకు మిర్యాలగూడ పట్టణంలోని సెయింట్ జాన్స్ హై స్కూల్ విద్యార్థిని ఎంపికయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్ వి డిగ్రీ కళాశాలలో ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు.
డిస్కస్ త్రో అండర్ 14 విభాగంలో మిర్యాలగూడ సెయింట్ జాన్స్ పాఠశాల విద్యార్థిని మైత్రి రాష్ట్రస్థాయి రెండవ బహుమతిని సాధించింది. ఆమె రాష్ట్రస్థాయిలో ఖమ్మంలో నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష, పాఠశాల చైర్మన్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రస్థాయికి ఎంపికైన మైత్రిని అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలలో తమ పాఠశాల విద్యార్థులు జిల్లా, స్థాయి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలియజేశారు.
MOST READ :
-
Video : బస్సులో ప్రయాణికురాలి ఆభరణాలు చోరీ చేసిన ఆర్టీసీ బస్ డ్రైవర్.. (వీడియో)
-
Gold Price : మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా రూ. 14,700 తగ్గిన బంగారం ధర..!
-
Family Survey : మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా..? సర్వే అంతా కోడ్ లోనే..!
-
District collector : ధాన్యం సేకరణలో ఏఈఓ లు రైతులకు అందుబాటులో ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!









