Hyderabad : దేశంలో వైమానిక రంగం బలోపేతం..!

Hyderabad : దేశంలో వైమానిక రంగం బలోపేతం..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
శంషాబాద్‌లోని జిఎంఆర్ ఏరోపార్క్‌లో ప్రపంచ ప్రఖ్యాత సఫ్రాన్ ఏరోస్పేస్ సంస్థ నెలకొల్పిన లీప్ ఇంజిన్ ఎంఆర్ఓ ప్రారంభోత్సవం, అలాగే ఎం 88 ఎం ఆర్ ఓ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు , మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లతో కలిసి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. దేశంలో రక్షణ, వైమానిక రంగ బలోపేతానికి కీలకమైన ఈ ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
వర్చువల్‌గా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
సఫ్రాన్ యొక్క ఎం 88 మిలిటరీ ఇంజిన్ ఎం ఆర్ ఓ కొరకు కూడా శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.ఫ్రాన్స్ వెలుపల రాఫెల్ ఇంజిన్లకు అటువంటి మొదటి సదుప ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ నేవీ వేగంగా పెరుగుతున్న రాఫెల్ ఫ్లీట్ కు ఈ ఎం ఆర్ ఓ సౌకర్యం మద్దతు ఇస్తుంది.డిఫెన్స్ ఏవియేషన్ హబ్‌గా తెలంగాణ తన ప్రత్యేకతను చాటుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేలా హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ తయారీ కారిడార్ మంజూరు చేయాలని ప్రధానమంత్రి కి విజ్ఞప్తి చేశారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాలని ఆహ్వానించారు.
MOST READ :









