Nalgonda : నీట్‌లో ఆలిండియా 100 వ ర్యాంక్ సాధించిన విద్యార్థిని.. డీఐఈఓ అభినందన..!
Nalgonda : నీట్‌లో ఆలిండియా 100 వ ర్యాంక్ సాధించిన విద్యార్థిని.. డీఐఈఓ అభినందన..!
నల్లగొండ, మన సాక్షి
నీట్ ఫలితాల్లో నల్లగొండ పట్టణం చర్లపల్లిలోని ఎస్ ఆర్ కళాశాల విద్యార్థిని బచ్చు ప్రియాంక ఆలిండియా స్థాయిలో 100వ ర్యాంకు సాధించడం తో మంగళవారం డీఐఈఓ దస్రూనాయక్ ఎస్ జోనల్ ఇన్‌చార్జి దోనాల శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విద్యార్థిని ప్రియాంకను శాలువాలతో సన్మానించి అభినందించారు.
అదే విధంగా ఆమె తల్లిదండ్రులను అభినందించారు. ప్రియాంక తోపాటు నల్గొండ బ్రాంచ్ లో మెడిసిన్ ర్యాంక్ సాధించిన పావని, లేఖన, ప్రవల్లిక, జ్యోతి, గాయత్రి, దివ్య, ధరణి లను వల్ల తల్లీ దండ్రులను చలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.
అనంతరం డీఐఈఓ మాట్లాడుతూ కష్టపడి చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు ఎదుగాలని ఆకాంక్షించారు. ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఏనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోశ్‌రెడ్డి, సీఈఓ సురేందర్‌రెడ్డి, నల్లగొండ బ్రాంచ్ అసిస్టెంట్ జోనల్ సతీశ్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు మనోజ్ రెడ్డి , డీన్ కిషోర్ బాబు, ఏఓ సరితారెడ్డి , అధ్యాపకులు వర్ధన్, ప్రసన్న, శ్రీనివాస్,శోభ విద్యార్థులను అభినందించారు.
MOST READ :
-
District Collector : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఇండ్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
-
Survey: దోమల అగరబత్తుల తయారీలో నిబంధనలకు పాతర.. అసౌకర్యంలో 67 శాతం ప్రజలు..!
-
Mahalakshmi : తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2500.. వారే అర్హులు.. ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో భారీ మార్పులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!
-
Rythu Bharosa : టింగ్..టింగ్..టింగ్.. మోగుతున్న పోన్లు.. వారికి బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా డబ్బులు..!









