తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : విద్యార్థులే ఉపాధ్యాయులయ్యారు..!

Miryalaguda : విద్యార్థులే ఉపాధ్యాయులయ్యారు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ్ లోని అభ్యాస్ ప్రైమరీ స్కూల్లో శుక్రవారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులలో నైపుణ్యత పెంపొందించేందుకు స్వపరిపాలన దినోత్సవం ఎంతగానో దోహదపడుతుందని ముఖ్యఅతిథిగా విచ్చేసిన పాఠశాల డైరెక్టర్ వంగాల నిరంజన్ రెడ్డి పుష్పలత అన్నారు.

స్థానిక సంతోష్ నగర్ లోని అభ్యాస్ ప్రైమరీ స్కూల్లో స్వపరిపాలన దినోత్సవం విద్యార్థులచే ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వంగాల నిరంజన్ రెడ్డి పుష్పలత మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులుగా తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి పలువురిని ఆకట్టుకుందన్నారు.

ఇలాంటి స్వపరిపాలన దినోత్సవాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని స్వపరిపాలన దినోత్సవం అనేది విద్యార్థులకు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి, బాధ్యతను నేర్పడానికి నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమం. ఈ రోజున విద్యార్థులు కలెక్టర్ గా, ఎమ్మెల్యేగా, ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా, ఇతర పాఠశాల సిబ్బందిగా బాధ్యతలు స్వీకరించి, పాఠశాల నిర్వహణలో పాల్గొన్నారు.

బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ఇట్టి కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అనంతరం చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్వేతా రెడ్డి అనితారెడ్డి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!

  4. Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!

మరిన్ని వార్తలు