క్రైంBreaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

కంగ్టి, మన సాక్షి :

పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థత కు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లా లో చోటుచేసుకుంది. 24 మంది విద్యార్థులు నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని బిబిపేట్‌ గ్రామంలోగల ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించటం వలన పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ కుమార్‌ షెట్కార్‌ ఖేడ్లో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సోమవారం పరామర్శించారు.

అనంతరం ఎంపీ సురేష్‌ షెట్కార్‌ మాట్లాడుతూ. విద్యార్థులకు ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బందితో పిల్లలను జాగ్రత్తగా చూసుకేవాలని అన్నారు.

సంగారెడ్డి జిల్లాలో విద్యార్థులకు అస్వస్థత

బిబీపేట్‌ ఉన్నత పాఠశాలలో 24 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనానంతరం విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో ఉపాధ్యాయులు గమనించి విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. నారాయణఖేడ్‌ ఆసుపత్రిలో విద్యార్ధులు చికిత్స పొందుతున్నారు.

మధ్యాహ్న భోజనంలో గుడ్డు తినడం వల్లనే అస్వస్థతకు గురైనట్టు తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు శంకరాయ్యస్వామి, నారాయణాఖేడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహిర్ అలీ,మాజీ జడ్పీటీసీ గుండు మోహన్, నారాయణాఖేడ్ నియోజికవర్గం ఎస్సిసెల్ అధ్యక్షులు సాయిలు, కౌన్సిలర్ వివేకానంద మహేందర్, యునుస్, ఫయాజ్, ఫరూక్, మారుతీ నాయక్, భరత్ పటేల్ , తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Cm Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులకు ఎల్ఎస్ గ్రూప్ ఆసక్తి.. త్వరలో రానున్న బృందం..!

MIRYALAGUDA : మిర్యాలగూడకు కొత్తగా ఒక ఎత్తిపోతల, 3 చెక్ డ్యాములు మంజూరు..!

Miryalaguda : సాగర్ కాలువలు ఇలా.. నీరు పారేది ఎలా..!

మరిన్ని వార్తలు