Miryalaguda : రాష్ట్రస్థాయి ఒలంపియాడ్ పరీక్షల్లో శిష్య స్కూల్ విద్యార్థుల ప్రతిభ..!
Miryalaguda : రాష్ట్రస్థాయి ఒలంపియాడ్ పరీక్షల్లో శిష్య స్కూల్ విద్యార్థుల ప్రతిభ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
సుచిర్ ఇండియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఒలంపియాడ్ ప్రతిభ పోటీ పరీక్షల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ చెందిన శిష్య స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు.
రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు, జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో శ్రీవల్లి (8వ తరగతి) దేవాన్ష్ (4వ తరగతి), రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు, జిల్లా స్థాయిలో 2వ ర్యాంకు సాధించిన విద్యార్థిని నేహా శ్రీ (8వ తరగతి) చదువుతున్నారు. వీరు 1500 రూపాయల విలువగల బహుమతులను గెలుపొందారు.
వీరితోపాటు పాఠశాలలో 56 మంది విద్యార్థులు 85% మెరుగైన ప్రతిభను కనబరిచి జిల్లా స్థాయిలో నిలిచారు. వీరికి పాఠశాల ప్రిన్సిపాల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ పరీక్షకు సంబంధించిన పోటీ పరీక్షల్లో తమ పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరుచుతున్నారని తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించి విద్యార్థుల సృజనాత్మకతకు, పోటీ తత్వం మెరుగుపడటానికి కృషి చేస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Gold Price : మరోసారి కుప్పకూలిన బంగారం ధర.. తులం రూ.56 వేల దారిలో..!
-
Power Cut : రేపు మిర్యాలగూడలో విద్యుత్ కోత.. ప్రాంతాలు, వేళలు ఇవే..!
-
Awesome : అద్భుతం.. గాజు సీసాలో సీత రాముల విగ్రహాలు..!
-
Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. తోటలో కల్తీ మద్యం తయారీ.. బ్రాండెడ్ పేరుతో విక్రయం..!
-
Banks : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 10 లోగా ఇది చేయకుంటే మీ ఎకౌంటు క్లోజ్..!









