Breaking Newsక్రైంతెలంగాణ
TG News : 41 మంది మావోయిస్టుల లొంగుబాటు..!

TG News : 41 మంది మావోయిస్టుల లొంగుబాటు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, పోలీస్ శాఖ అందిస్తున్న భరోసాతో 41 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. 24 ఆయుధాలతో సహా డీజీపీ బి. శివధర్ రెడ్డి IPS ఎదుట లొంగిపోయారు. వీరిలో ప్లాటూన్ కమిటీ మెంబర్లతో పాటూ డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు. వీరందరికీ పునరావాసం కల్పిస్తామని, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 509 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు డీజీపీ తెలిపారు.










