తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Paddy : వరి లో డ్రం సీడర్, వెదజల్లే పద్ధతులపై బెంచ్ మార్క్ శాస్త్రవేత్తల సర్వే..!

Paddy : వరి లో డ్రం సీడర్, వెదజల్లే పద్ధతులపై బెంచ్ మార్క్ శాస్త్రవేత్తల సర్వే..!

పెన్ పహాడ్, మన సాక్షి :

వరి లో డ్రం సీడర్ వెదజల్లే పద్ధతులతో అధిక దిగబడులు పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం కే.వి.కే శాస్త్రవేత్తలు ఎ. కిరణ్ తెలిపారు. గురువారం పెన్ పహాడ్ మండలంలోని లింగాల గ్రామలలో ఐ.సి.ఎ.ఆర్ భారతీయ వరి పరిశోధన సంస్థ, రాజేంద్ర నగర్ ఆధ్వర్యం లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీ.ఎస్.ఆర్ ఫండ్ సహకారంతో నేరుగా విత్తే పద్ధతి వరి సాగు పై చేసే రైతులకు బెంచ్ మార్క్ సర్వే నిర్వహించారు.

బెంచ్ మార్క్ సర్వేలో భాగంగా రైతుల నుండి డ్రం సీడెర్ సాగు చేసేనేల రకాలు, విత్తన రకాలు, ఎన్ని మొతదూలో ఎరువులు వాడినారు, చీడ పీడల సమస్య, నీటి యజమాన్య పద్ధతులు, కలుపు యాజమాన్య పద్ధతులును రైతులను శాస్త్రవేత్తలు ఆడిగి తెలుసుకున్నారు.

రైతులకు రైస్ క్లినిక్ అప్లికేషన్ వాడే విధానం వివరించారు. ఈ కార్యక్రమంలో కే . వి.కే- శాస్త్రవేత్తలు ఎ. కిరణ్, క్షేత్ర సహాయకులు, ఎ . సాయికిరణ్ ,కే.అజయ్, , రైతులు బత్తిని అంజయ్య, మామిడి రాంబాబు, రామయ్య తదిరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. TG News : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు సంచలన నిర్ణయం..!

  2. Platelets : ప్లేట్‌లెట్స్ పడిపోయాయా.. అయితే ఇలా తిరిగి పొందండి ఈజీ..!

  3. Nalgonda : జిల్లా వ్యవసాయాదికారి రైతులకు కీలక సూచన.. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..! 

  4. Success Story : తండ్రి కలను నిజం చేసిన కూతురు.. ఇదే కదా సక్సెస్ అంటే..!

మరిన్ని వార్తలు