Suryapet : ఘనంగా సిద్ధార్థ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!
జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ హైస్కూల్ లో 2012- 13 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

Suryapet : ఘనంగా సిద్ధార్థ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!
సూర్యాపేట, మనసాక్షి:
జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ హైస్కూల్ లో 2012- 13 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంను ఆదివారం ఘనంగా నిర్వహించారు. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న నాటి విద్యార్థులంతా ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాటి తమ గురువులను ఘనంగా సన్మానించారు.
నాటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.తమ విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు సిద్ధార్థ హైస్కూల్ పునాది వేసిందన్నారు.అనంతరం విద్యార్థులు ఒకొక్కరుగా మాట్లాడి పాఠశాల జ్ఞాపకాలు,ప్రస్తుతం తమ స్థితిగతులను తెలిపి ఆనందంగా గడిపారు.
నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో నేడు తాము వివిధ స్థాయిల్లో ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ మర్రు హనుమంతరావు, నాటి ఉపాధ్యాయులు మహేందర్ రెడ్డి, సైదులు, రమేష్, సుజాత, కాంతారావు, లింగయ్య, ఉపేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.









