TOP STORIESBreaking Newsసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లాలో అధికారుల నిర్వాకం.. బతికుండగానే అధికారులే చంపేశారు..!

Suryapet : సూర్యాపేట జిల్లాలో అధికారుల నిర్వాకం.. బతికుండగానే అధికారులే చంపేశారు..!

పెన్ పహాడ్, మనసాక్షి :

బతికుండగానే చనిపోయాడని అధికారులు నిర్ధారించారు. ఏడాదికాలంగా తాను బతికే ఉన్నానని కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది. అతనికి ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ తొలగించారు. దాంతో ఆ నిరుపేద ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం నారాయణగూడెం లో చోటుచేసుకుంది.

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని నాగుల పహాడ్ గ్రామానికి చెందిన రాయిలి బాలయ్య తండ్రి వెంకయ్య 75 సంవత్సరముల వృద్ధుడు. 2014 నుండి పింఛను తీసుకుంటున్నాడు. ఇట్టి వ్యక్తి మృతి చెందకు ముందే మృతి చెందినట్టుగా 2024 ఫిబ్రవరి లో ఇతని పింఛను పెన్ పహాడ్ మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వారు అసమర్థతతో పింఛను తొలగించడం జరిగిందని రాయలి బాలయ్య మన సాక్షి ప్రతినిధితో తన ఆవేదనను వెలిబుచ్చినాడు.

అసలు విషయంలోకి వెళితే

అదే గ్రామము నాగులపహాడ్ గ్రామానికి చెందిన మామిడి బాలయ్య గత మూడు సంవత్సరముల క్రితం మృతి చెందినాడు. ఇతని పించెను భార్య మామిడి జయమ్మ పేరుపై బదిలీ చేయుటకు దరఖాస్తు చేసుకున్నారు. మామిడి బాలయ్య పింఛన్ ను రద్దు చేయవలసి ఉండగా? అధికారుల అసమర్ధతో గత పది సంవత్సరముల నుండి పెన్షన్ తీసుకుంటున్న రాయలి బాలయ్య పెన్షన్ను అధికారుల అసమర్ధతతో తీసివేయడంతో డిలీట్ చేసినారు.

ఇట్టి వ్యక్తి మృతి చెందకు ముందే, మరణ ధ్రువీకరణ పత్రం పరిశీలించక ముందే, ఆధార్ కార్డును, పెన్షన్ యొక్క ఐడి నెంబరు పరిశీలించక ముందే, రాయిలీ బాలయ్య పెన్షన్ రద్దు చేసినారు. ఇట్టి విషయంపై వృద్ధుడు రాయలి బాలయ్య పలుమార్లు మండల అభివృద్ధి అధికారి చుట్టూ తిరిగిన సరైన సమాధానం చెప్పటం లేదని నేను మృతి చెందక ముందే ఎందుకు నా పెన్షన్ తీసివేసినారని అధికారులను అడిగితే సరియైన సమాధానం చెప్పడం లేదని బాలయ్య తన ఆవేదనను వెలిబుచ్చినారు.

ఇప్పటికైనా అధికారులు చేసిన తప్పును సరిచేసుకుని 75 సంవత్సరాల వృద్ధుడనైన నాకు పెన్షన్ ఇప్పియ్యాలని ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నాడు. నేను మృతి చెందక ముందే మృతి చెందినట్లుగా నా పెన్షన్ తొలగించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాయలి బాలయ్య కోరినారు.

MOST READ ; 

  1. TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!

  2. PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!

  3. PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!

  4. PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!

  5. Smart Phone : స్మార్ట్ ఫోన్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఆ మెసేజ్ అర్జెంటుగా డిలీట్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ..!

మరిన్ని వార్తలు