Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

BREAKING : సూర్యాపేటలో ప్రేమోన్మాది ప్రియురాలు పై సుత్తితో దాడి.. స్థానికులు దేహశుద్ధి..!

సూర్యాపేట జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నిన్న వనస్థలిపురంలో మాజీ భర్త హత్య చేసిన ఘటన మరవకముందే సూర్యాపేటలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రియురాలు దూరం పెడుతుందని ఆమెను సుత్తితో దాడి చేశాడు.

BREAKING : సూర్యాపేటలో ప్రేమోన్మాది ప్రియురాలు పై సుత్తితో దాడి.. స్థానికులు దేహశుద్ధి..!

మన సాక్షి, సూర్యాపేట :

సూర్యాపేట జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నిన్న వనస్థలిపురంలో మాజీ భర్త హత్య చేసిన ఘటన మరవకముందే సూర్యాపేటలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రియురాలు దూరం పెడుతుందని ఆమెను సుత్తితో దాడి చేశాడు.

వివరాల ప్రకారం.. అలుగునూరు గ్రామానికి చెందిన ఒక యువతి, లింగంపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు ప్రేమించుకున్నారు. అయితే యువతీ తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. ఈ విషయంపై పెద్ద మనుషులతో పలుమార్లు పంచాయతీ కూడా పెట్టారు. కాగా యువతి సూర్యాపేటలోని స్నేహ నగర్ లో బంధువుల ఇంటికి వెళ్ళింది.

ఆ విషయం తెలుసుకున్న యువకుడు గురువారం ఇంట్లోకి దూరి సుత్తితో ఆమె తలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్ధానికులు అతడిని పట్టుకుని కట్టేసి దేహశుద్ధి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

  1. Nalgonda : రెండేళ్లలో నల్లగొండ స్మార్ట్ సిటీ, ఎలా ఉంటుందో చూపిస్తా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

  2. RSS : ఆర్.ఎస్.ఎస్ ఎవ్వరికీ వ్యతిరేకం కాదు.!

  3. TG News : పంచాయతీలకు గుడ్ న్యూస్.. ఆ నిధులు విడుదల..!

  4. Rythu Bharosa : ఏడాదంతా రైతు భరోసా.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!

మరిన్ని వార్తలు