అభివృద్దిBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేటను మరింత సుందరంగా తీర్చిదిద్దుకుందాం..!

సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రూ.50 లక్షల నిధులతో నాలా కల్వర్టు పనులను చేపడుతున్నామని, త్వరలోనే పనులు చేపట్టి రెండు నెలల్లో పూర్తి చేస్తామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి,మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు.

Suryapet : సూర్యాపేటను మరింత సుందరంగా తీర్చిదిద్దుకుందాం..!

50 లక్షల వ్యయంతో 46, 47 వార్డులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సూర్యాపేట, మనసాక్షి

సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రూ.50 లక్షల నిధులతో నాలా కల్వర్టు పనులను చేపడుతున్నామని, త్వరలోనే పనులు చేపట్టి రెండు నెలల్లో పూర్తి చేస్తామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి,మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు.

సోమవారం సూర్యాపేట పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డులోని నాలా కల్వర్టు పనులకు 47వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ మున్సిపల్ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కల్వర్టు నిర్మాణం లేకపోవడంతో ముఖ్యంగా స్కూల్, కాలేజి విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అనంతరం 47వ వార్డులోని వాసవి కన్యకపరమేశ్వరి గుడి వెనుక వీధిలో సీసీ రోడ్డు, సీపీఎం పార్టీ కార్యాలయం వెనుక వీధిలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజద్ అలి, మున్సిపల్ కౌన్సిలర్ నాగుల వాసు, జిల్లా వాణిజ్య సెల్ చైర్మన్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బైరు వెంకన్న గౌడ్, అయూబ్ ఖాన్, రాచకొండ శ్రీనివాస్, దంతాల సాయి నవీన్, దంతాల వీరయ్య, అంతటి జానీ, బషీర్, సాజిద్, పిడమర్తి ఉపేందర్, నరేందర్ నాయుడు, పిల్లల నాగరాజు, కుమ్మరికుంట్ల కిషోర్, వార్డు ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు