Suryapet : సూర్యాపేట పోలీసులు ఎఫ్ ఐ ఆర్ ఎట్ డోర్ స్టెప్ నూతన కార్యక్రమం.. బాధితుల ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరణ..!
బాధితుల ఫిర్యాదుపై ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే FIR నమోదు చేయడం కార్యాచరణ అమలు చేయడంలో భాగంగా నడిగూడెం పోలీసులు జిల్లాలో మొదటి కేసు నమోదు చేసినారని ఎస్పీ నరసింహ ఐపిఎస్ తెలిపారు.

Suryapet : సూర్యాపేట పోలీసులు ఎఫ్ ఐ ఆర్ ఎట్ డోర్ స్టెప్ నూతన కార్యక్రమం.. బాధితుల ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరణ..!
బాధితుల ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించిన నడిగూడెం పోలీసులు
సూర్యాపేట జిల్లాలో తొలి కేసు నమోదు
సూర్యాపేట, మన సాక్షి:
బాధితుల ఫిర్యాదుపై ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే FIR నమోదు చేయడం కార్యాచరణ అమలు చేయడంలో భాగంగా నడిగూడెం పోలీసులు జిల్లాలో మొదటి కేసు నమోదు చేసినారని ఎస్పీ నరసింహ ఐపిఎస్ తెలిపారు.
నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామానికి చెందిన వికాళాంగురాలు భూమా రమాదేవి భర్త వేధిస్తున్నాడు, కొడుతున్నాడు అని డయల్ 100 కు ఫోన్ చేయగా సంచారం అందుకున్న నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే కేసు నమోదు చేసి FIR కాపీని బాదితురాలికి అందించారని తెలిపారు.
FIR ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమం ద్వారా మహిళలపై, పిల్లలపై, వృద్దులపై దాడులు, దొంగతనాల, భౌతిక దాడులు, బాల్య వివాహాలు, వేదింపులు వట్టి సందర్భాల్లో బాధితులకు భరోసాగా ఉంటుంది, ఇంటికి వెళ్లి కేసు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. మొదటి కేసు నమోదు చేసిన నడిగూడెం పోలీసులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.
MOST READ :
-
Gold Price : బాబోయ్.. పసిడికి ఊహించని ధర, ఒక్కరోజే అంత పెరిగిందా.. ఆల్ టైం రికార్డ్..!
-
Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్టేషన్ చేసుకోవాలి..!
-
Viral : చంకన బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన కానిస్టేబుల్.. ప్రశంసల జల్లు..!
-
Gold Price : బాబోయ్.. పసిడికి ఊహించని ధర, ఒక్కరోజే అంత పెరిగిందా.. ఆల్ టైం రికార్డ్..!
-
Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!