తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో నేటి నుంచి రూ.10వేలు..!
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో నేటి నుంచి రూ.10వేలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. వరద బాధితులకు సహాయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం వరద బాధితులకు తక్షణ సహాయంగా ఈరోజు శుక్రవారం నుంచి వారి ఖాతాలలో పదివేల రూపాయలను జమ చేయనున్నారు.
ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వరదల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల సహాయం అందించనున్నారు.
పాడి పశువులు చనిపోతే 50వేల రూపాయలు, మేకలు గొర్రెలు చనిపోతే 5000 రూపాయల సహాయాన్ని అందించనున్నారు. అదే విధంగా పంట పొలాలు నష్టపోయిన వారికి కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందించనున్నారు.
LATEST UPDATE :
సింగూరు ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. ఇక రెండు పంటలకు డోకా లేదు..!
BREAKING : మన్యంలో మోగిన తుపాకీ తూటాలు.. ఆరుగురు మావోయిస్టులు మృతి..!
Miryalaguda : మిర్యాలగూడకు సబ్ కలెక్టర్ హోదా.. విధుల్లో చేరిన ఐఏఎస్ అధికారి నారాయణన్..!









