TG News : తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.4500..!
TG News : తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.4500..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం వారికి భారీ శుభవార్త తెలియజేసింది. రాష్ట్రంలోని అనాథల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు 4500 రూపాయల ఆర్థిక భరోసా ఇవ్వనట్లు మంత్రి సీతక్క ప్రకటించారు.
అనాధ పిల్లలకు మానసిక ధైర్యాన్ని కల్పించడంతో పాటు వారిని సంరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దాంతో వారికి జీవనోపాధి, వైద్య సేవలు, భద్రత కలుగుతుందని సీతక్క పేర్కొన్నారు.
మంత్రి సీతక్క మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి హైదరాబాద్ శివారులోని శిశువిహార్ లో ఉన్న అనాథల వద్దకు వెళ్లి వారికి ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. టూరిజం ప్లాజా లో జరిగిన కార్యక్రమంలో సీతక్క చిన్నారులకు భోజనం తినిపించారు. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఒక్కొక్కరికి 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు లభిస్తాయి అని పేర్కొన్నారు.
అనాధల సంక్షేమానికి పలు పథకాలతో రాష్ట్రం కట్టుబడి ఉందని తెలిపారు. ఆశ్రమం లేని పిల్లలను కుటుంబాలే ఆదుకుంటే వారికి 4500 ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం అనాధలకు భవిష్యత్తులో మంచి శుభవార్త కానున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక న్యాయానికి ప్రతిబింబంగా నిలవనున్నది.
MOST READ :
-
UPSC : పట్టు వదలని విక్రమార్కుడు.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో మిర్యాలగూడ వాసి టాప్ ర్యాంకర్..!
-
Hyderabad : హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!
-
Miryalaguda : వ్యవసాయ అధికారుల ఫోన్ నెంబర్లు మార్పు.. ఇవీ నెంబర్లు..!
-
Applications : బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కోసం ధరఖాస్తుల ఆహ్వానం..!









