TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!

TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో మహిళ స్వయం సహాయక సంఘాల మహిళలకు తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి భారీ శుభవార్త తెలియజేసింది. స్వయం సహాయక సంఘాల సభ్యుల ప్రమాద బీమా పథకాన్ని పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
స్వయం సహాయక సంఘాల సభ్యుల ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శ్రీనిధి ద్వారా బీమా అమలు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రమాద బీమా అమల్లోకి వచ్చింది. ప్రమాదవశాత్తు మరణించిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు 10 లక్షల రూపాయల వరకు భీమాని ప్రభుత్వం అందజేస్తుంది. ఇప్పటికీ 409 మందికి ఈ ప్రభుత్వం ప్రమాద బీమా మంజూరు చేసింది.
ప్రమాద బీమా ఇస్తున్న ధీమాతో స్వయం సహాయక సంఘాలలో మహిళలు సభ్యులుగా చేరుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1. 67 లక్షల మంది కొత్త సభ్యులు చేరారు. ఇదిలా ఉండగా మరో నాలుగేళ్ల పాటు ప్రమాద బీమా పథకాన్ని పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల కష్టకాలంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు భరోసాగా ఈ బీమా పథకం ఉంటుంది.
MOST READ :
-
Gold Price : భారీగా తగ్గిన గోల్డ్.. ఈరోజు రేట్లు..!
-
Srisailam : శ్రీశైలం కు భారీగా వరద పోటు.. గేట్లు ఎత్తేందుకు సిద్ధమైన అధికారులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Miryalaguda : పోలీసులకు జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!
-
Nagarjuna Sagar : పెరుగుతున్న నాగార్జునసాగర్ జలాశ నీటిమట్టం..!
-
TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. సర్కార్ నిర్ణయం ఇదే..!









