Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణ

TG News : ఎమ్మెల్యేను వదలని సైబర్ మోసగాళ్లు.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే..!

సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సామాన్యులే కాకుండా ప్రజాప్రతినిధులకు కూడా గాలం వేస్తున్నారు. ఇలాంటిదే తెలంగాణలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలను సైతం సైబర్ నేరగాళ్లు వదల్లేదు. జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.

TG News : ఎమ్మెల్యేను వదలని సైబర్ మోసగాళ్లు.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే..!

మన సాక్షి, హైదరాబాద్ :

సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సామాన్యులే కాకుండా ప్రజాప్రతినిధులకు కూడా గాలం వేస్తున్నారు. ఇలాంటిదే తెలంగాణలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలను సైతం సైబర్ నేరగాళ్లు వదల్లేదు. జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో నమ్మ పలికిన ఒక నేరగాడు ఎమ్మెల్యే నుంచి లక్ష రూపాయలు కాజేశాడు.

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సైబర్ నేరగాడు ఫోన్ చేసి తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని, ఆర్థిక శాఖలో పని చేస్తున్నట్లుగా పరిచయం చేసుకున్నాడు. వికసిత్ భారత్ పథకం కింద అర్హులైన వారికి పది లక్షల రూపాయల వరకు రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. మీ నియోజకవర్గంలో అర్హులైన వారు జాబితా పంపిస్తే వారికి రుణాలు మంజూరు చేస్తామని నమ్మించాడు. నియోజకవర్గానికి 40 మంది లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేస్తామని చెప్పాడు. నిందితుడి మాటలు రాజేశ్వర్ రెడ్డి నమ్మాడు. అందుకు సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజు పంపాలని చెప్పడంతో ఒక్కొక్కరికి 2500 రూపాయల చొప్పున 40 మందికి ఒక లక్ష రూపాయలను ఫోన్ పే ద్వారా సైబర్ నేరగానికి పంపారు.

ఆ తర్వాత డబ్బులు రాలేదని మరోసారి పంపాలని నేరగాడు కాల్ చేయడంతో ఎమ్మెల్యేకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ నెంబర్ లావాదేవీల వివరాలను జూబ్లీహిల్స్ పోలీసులకు అందజేశారు. సైబర్ క్రైమ్ విభాగ సహాయంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తలు