తెలంగాణBreaking Newsఉద్యోగం

TG News : నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో 3వేల ఉద్యోగాల భర్తీ, మంత్రి పొన్నం వెల్లడి..!

TG News : నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో 3వేల ఉద్యోగాల భర్తీ, మంత్రి పొన్నం వెల్లడి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆదివారం కరీంనగర్ లో నూతనంగా 33 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకు ఎంతో మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా మహిళా శక్తి, మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామని ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నట్టు చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల డీజిల్ తో నడిచే బస్సు ఒకటి కూడా లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3000 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు