తెలంగాణBreaking Newsరాజకీయం

TG : రాజ్యసభ స్థానాలపై సస్పెన్స్ కు తెర.. వారి పేర్లు ఖరారు..!

తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది.

TG : రాజ్యసభ స్థానాలపై సస్పెన్స్ కు తెర.. వారి పేర్లు ఖరారు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. ఇంతకాలంగా సస్పెన్స్ లో ఉన్న విషయం తెలిసిందే. కాగా బుధవారంతో ఆ సస్పెన్స్ కు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ ఇరువురి అభ్యర్థిత్వాలను అధికారికంగా ప్రకటించింది.

ఏఐసీసీ కోటాలో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీకి మరోసారి రాజ్యసభ అవకాశం కల్పించారు.ణ అదే విధంగా రాష్ట్ర కోటాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న వేం నరేందర్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది.

మరిన్ని వార్తలు