తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

TG News : గ్రామ పాలన అధికారుల పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. ఇవీ పరీక్షకు తీసుకరావల్సినవి, తీసుకరాకూడనివి..!

TG News : గ్రామ పాలన అధికారుల పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. ఇవీ పరీక్షకు తీసుకరావల్సినవి, తీసుకరాకూడనివి..!

నారాయణపేట టౌన్, మన సాక్షి :

గ్రామ పాలన అధికారుల రెండవ దఫా పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులకు అధికారులు పలు సూచనలు చేశారు. పరీక్ష హాల్లోకి అభ్యర్థులు తీసుక రావలసినవి, తీసుకురాకూడనివి ఏంటనేది స్పష్టంగా తెలియజేశారు.

ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఒక ప్రకటనలో తెలిపారు.గ్రామ పాలన అధికారుల రెండవ దఫా పరీక్షను ఈ నెల 27 న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

పరీక్ష నిర్వహణకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. గ్రామ పాలన అధికారుల రెండవ దఫా నిర్వహించే పరీక్ష రాసే అభ్యర్థులు పాస్‌పోర్ట్ ఫోటోను నిర్ణీత స్థలంలో అతికించాలని, లేకుంటే, హాల్ టికెట్ అంగీకరించబడదని, పరీక్ష ప్రవేశం కు నిరాకరించడం జరుగుతుందని తెలిపారు.

హాల్ టికెట్‌ను పరీక్షా కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద , పరీక్షా హాలులో కూడా చూపించాలని, లేని పక్షంలో అభ్యర్థులు పరీక్ష రాయడానికి అనుమతించబడరని స్పష్టం చేశారు. అంతేకాకుండా అభ్యర్థి నామినల్ రోల్స్‌లో అతికించడానికి పరీక్షా హాలులో ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటోను సమర్పించాలని సూచించారు.

పరీక్ష రాసే అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు వంటి ఎలక్ట్రానిక్ లేదా ఇతర గాడ్జెట్‌లను తమ వెంట తీసుకురావద్దని, చేతి గడియారాలు, వాచ్ కాలిక్యులేటర్లు. లాగ్ టేబుళ్లు, పర్సులు, నోట్స్, చార్టులు, పేపర్లు లేదా రికార్డింగ్ పరికరాలు పరీక్ష కేంద్రం లోపలకి తీసుకు రావడానికి అనుమతి లేదని. అభ్యర్థులు, ముఖ్యంగా మహిళలు హ్యాండ్‌బ్యాగులు / జోలాస్ / పౌచ్‌లు మొదలైన వాటిని తీసుకుని పరీక్షకు రాకూడదని సూచించారు.

అభ్యర్థుల విలువైన వస్తువులు లేదా వస్తువులను భద్రపరచడానికి క్లాక్ రూమ్ వంటి సౌకర్యం పరీక్షా కేంద్రంలో అందుబాటులో లేదని ఆయన తెలిపారు. జీపివో పరీక్ష కు సంబంధించిన 9154283913 హెల్ప్ నెంబర్ ను సంప్రదించ వచ్చని ఆయన తెలిపారు.

MOST READ : 

  1. Modi : ప్రధానమంత్రిగా మోడీ సరికొత్త రికార్డ్.. ఇందిరాగాంధీ రికార్డు బ్రేక్ చేసిన మోదీ..!

  2. ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్.. మీడియా పేరుతో వసూళ్లు..!

  3. PMSBY : ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపు.. మీరు అర్హులేనా..!

  4. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మేస్త్రి, సెంట్రింగ్ చార్జీల ఖరారు.. అధికంగా వసూలు చేస్తే చర్యలు..!

మరిన్ని వార్తలు