Nalgonda : నల్గొండ జిల్లాలో పసికందు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే అంటున్న బంధువులు..!
Nalgonda : నల్గొండ జిల్లాలో పసికందు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే అంటున్న బంధువులు..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండలో బుధవారం పసికందు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసికందు మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
దేవరకొండ మండలం మర్రిచెట్టు తండాకు చెందిన మూడవత్ రాహుల్ నందిని మొదటి కానుపు కోసం మంగళవారం ఉదయం 10 గంటలకు దేవరకొండ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. 9 నెలలు పూర్తి అయి రెండు రోజులే అయిందని నందిని చెప్పినా వినిపించుకోకుండా ఆపరేషన్ థియేటర్లో తీసుకువెళ్లారు.
3 గంటల వరకు నార్మల్ డిలవరి కోసం ప్రయత్నం చేసిన డాక్టర్లు. చివరికి నార్మల్ డెలవరీ కాక పోవడంతో ఆపరేషన్ చేయడం జరిగింది. రాత్రి 12:30 సమయంలో ఆపరేషన్ మొదలుపెడితే లోపలికి అలా వెళ్లి ఇలా వచ్చారని బంధువులు తెలిపారు.
అంతలోనే బాబుకు సీరియస్ ఉంది అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుక వెళ్లాల్సి ఉందని డ్యూటీలో ఉన్న సిబ్బంది చెప్పడం తో బంధువులు అత్యవసర చికిత్స కోసం హైదరాబాదుకు తీసుకో వెళ్లడం జరిగింది. హైదరాబాద్ తీసుకెళ్లిన బంధువులకు అక్కడ వైద్యులు తెలిపిన ప్రకారం.. పసికందు అక్కడే అప్పుడే మృతి చెందడం జరిగిందని వైద్యులు తెలిపారు.
విషయం తెలిసిన బంధువులు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వద్ద చేరుకున్నారు. వెంటనే దేవరకొండ పోలీస్ సిబ్బంది ఆసుపత్రి వద్ద చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ల పైన నర్సుల పైన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.
MOST READ :
-
Bank Transaction : ఫోన్ పే, గూగుల్ పే ఉందని ఎక్కువ లావాదేవీలు చేస్తున్నారా.. లిమిట్ ఎంతో తెలుసుకోకుంటే కష్టమే..!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి వెల్లడి, లేటెస్ట్ అప్డేట్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!
-
అనంతగిరి తహసిల్దార్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు..!









