NARAYANPET : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!
NARAYANPET : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించి పేద ప్రజలకు అండగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు.
ఆస్పత్రి రికార్డులను పరిశీలించి సిబ్బంది గురించి ఆరా తీశారు. సరైన సమయానికి సిబ్బంది, వైద్యులు హాజరై వైద్య సేవలు అందించాలని అని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అవసరమయ్యే మందులు ఇతర సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.
అలాగే చిన్నపిల్లల ఆసుపత్రిని కూడా తనిఖీ చేసి చిన్నపిల్లల వైద్య సేవలు ఎలా ఉన్నాయని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రంజిత్ కుమార్, చిన్న పిల్లల వైద్యుడు క్రాంతి కిరణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
TG Govt : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. విద్యార్థులకు గుడ్ న్యూస్..!









