District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలి..!
సూర్యాపేట, మన సాక్షి:
హాస్పిటల్స్, రోగ నిర్దారణ కేంద్రాలు నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో జరిగిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ (డి ఆర్ ఏ ) కమిటీ సమావేశం లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్,పి సి పి ఎన్ డి టి యాక్ట్ ల నియమ నిబంధనలు పాటించే వాటికి మాత్రమే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న వారం లోపల తాత్కాలిక అనుమతి ఇచ్చి తదుపరి క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేసి హాస్పటల్లో, రోగ నిర్దారణ కేంద్రాలలో అన్ని నియమ నిబంధనలు పాటిస్తే శాశ్వతంగా అనుమతి ఇవ్వాలని సూచించారు.
ఏమైనా నిబంధనలు పాటించకపోతే నోటీసులు జారీ చేసి కారణాలు తెలుపుతూ తిరస్కరించాలని మరోసారి దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఇవ్వాలని తెలిపారు.డాక్టర్స్ హాస్పిటల్ లో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారా సొంత యజమానిగా ఉన్నారా, అనుమతి తీసుకున్న డాక్టర్లు మాత్రమే పని చేస్తున్నారా లేదా వారి స్థానం లో ఎవరైనా పని చేస్తున్నారా, డాక్టర్ ఒక హాస్పిటల్ లో పని చేస్తున్నారా లేక ఇంకా ఎక్కడైనా పని చేస్తున్నారా, అలాగే వారి యొక్క సమయపాలన తెలియజేయాలని తెలిపారు.
రోగ నిర్ధారణ కేంద్రాలలో అర్హత ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇవ్వాలని అలాగే రిపోర్టులపై కచ్చితంగా డాక్టర్ సంతకం చేయాలని, స్కానింగ్ సెంటర్లలో నిపుణులైన రేడియాలజిస్టుల ఉండాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమించినచో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ ఎక్కడైనా అర్హత లేని వారు వైద్యం చేసిన లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆదేశించారు. ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు, డిఎంహెచ్వో పి చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు జి చంద్రశేఖర్, నాజియా, కోటిరత్నం, డిప్యూటీ డిఎంహెచ్ఓ జయ మనోహరి, మీడియా అధికారి సంజీవరెడ్డి తదితరులు హాజరైనారు.
MOST READ :









