Suryapet : పాలిసెట్ లో శ్రీజ కు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్.. అభినందించిన జిల్లా ఎస్పీ..!
Suryapet : పాలిసెట్ లో శ్రీజ కు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్.. అభినందించిన జిల్లా ఎస్పీ..!
సూర్యాపేట, మనసాక్షి :
విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు అని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. పదవ తరగతి అనంతరం నిర్వహించే రాష్ట్రస్థాయి పాలిసెట్ నందు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన నూతనకల్ మండలం, మిర్యాల గ్రామానికి చెందిన విద్యార్థిని శ్రీజ ను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ఎస్పీ నరసింహ అభినందించారు.
విద్యార్థులు పాఠశాల దశ నుండే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి చదవాలని అన్నారు. 10వ తరగతి తర్వాత ఎంచుకునే లక్ష్యం విద్యార్థులను ఉన్నతమైన గమ్యం వైపు నడిపిస్తుందన్నారు.ఇష్టమైన రంగంలో రాణించడానికి, మంచు భవిష్యత్తుకు పునాది అవుతుందని అన్నారు. గురువుల సూచనలు పాటిస్తూ, తల్లిదడ్రుల కళలను సాకారం చేయాలని అన్నారు. వివిధ రంగాల్లో దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తుల జీవిత విజయాలను స్పూర్తి తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ డీస్పీ ప్రసన్న కుమార్, విద్యార్థిని తండ్రి మధుసూధన్ రావు, స్నేహితులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
MOST READ :
-
Gold Price : దిగివచ్చిన బంగారం.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
-
Seeds : నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా.. విత్తనాలు కొనే ముందు రైతులు ఏం చేయాలి..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త..!
-
Gurukula : గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..!









