Breaking Newsఅభివృద్దిఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. పెండింగ్ లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. పెండింగ్ లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలి..!

ఖమ్మం, మనసాక్షి :

పాఠశాలల్లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ కీలక ఆదేశాలు జారీ చేశారు.  కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనుల పురోగతిపై బుధవారం అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ జిల్లాలో 44 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. పెండింగ్ పనులు పూర్తి చేసి ఎంబీ రికార్డులు వివరాలు నమోదు చేస్తే వెంటనే బిల్లులు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.

44 పాఠశాలల్లో పనుల పురోగతి వివరాలను పాఠశాలల వారిగా రివ్యూ చేసి అదనపు కలెక్టర్ పలు సూచనలు చేశారు. అక్టోబర్ నెలాఖరు వరకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలని అన్నారు. గ్రామాలలో పాఠశాలకు నీరు సరఫరా లేని పక్షంలో సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ నుంచి కనెక్షన్ అందించాలని అన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల సకాలంలో పూర్తి కాని పక్షంలో సంబంధిత పాఠశాల సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారుల వేతనంలో కోత విధించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సి.హెచ్. రామకృష్ణ, ఎంపీడీఓలు, ఎం.ఈ.ఓ. లు, సంబంధిత పాఠశాలల హెడ్ మాస్టర్ లు, ఏఈలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Kisan App : పత్తి అమ్ముకునేందుకు కిసాన్ కాపస్ యాప్ తప్పనిసరి.. రైతులకు అవగాహన కల్పించిన అధికారులు..!

  2. District collector : తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 సర్వే.. అందరు భాగస్వాములు కావాలి..!

  3. Health : యూరిక్ యాసిడ్ సమస్య ఉందా.. ఉపశమనం పొందడం ఎలా..!

  4. TG News : సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్..!

మరిన్ని వార్తలు