తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : ఆర్టీజన్ కార్మికుల కుటుంబాల్లో వెలుగు నింపడమే 1104 ధ్యేయం..!

Narayanpet : ఆర్టీజన్ కార్మికుల కుటుంబాల్లో వెలుగు నింపడమే 1104 ధ్యేయం..!

1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు.

నారాయణపేట టౌన్,  మనసాక్షీ :

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మంగళవారం పడమటి ఆంజనేయా స్వామి దర్శించుకున్నారు. 1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సేకరణ కార్యక్రమాన్ని ప్రతి ఏడు మాదిరిగా మక్తల్ సబ్ డివిజన్ అత్యవసర సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా 1104 యూనియన్ నారాయణపేట డివిజన్ నాయకత్వం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు అర్టీజన్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ పలు కార్మిక సంఘాల నాయకులు ఆర్టీజన్ కార్మికుల ను తప్పు దారి వెళ్ళుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఆర్టీజన్ కార్మికులు ఎవ్వరూ తొందర పడవద్దని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు అన్నారు. 1104 యూనియన్ విద్యుత్ కార్మికుల హాక్కుల కోసం పోరాడే ఏకైక యూనియన్ అన్నారు . స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన యూనియన్ 1104 చరిత్ర తెలుసు కోవాలని సూచించారు.

ఇటీవల ట్రాన్స్ కో విద్యుత్ యాజమాన్యం దృష్టి కి 54 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని 1104 తీసుకు పోయిన విషయాన్ని కార్మికులకు తెలియ పర్చారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా ఆర్టీజన్ కార్మికులకు అన్ని హక్కులు కల్ఫాంచే వరకు పోరాడుతుందన్నారు. ఐదేళ్ళయినా గ్రేడ్ చెంజ్ కాలేదని కావున గ్రేడ్ చెంజ్ చేయాలని డిమాండ్ చేశారు.

శాశ్వత ఉద్యోగులతో సమానంగా ఈ.ఎల్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్ కో అధికారుల దృష్టి లో మీ సమస్యలు ఉన్నాయి. తోందరపడి వాట్సాప్ లో వచ్చే వైరల్ నమ్మవద్దని సాయిబాబా హితవు పలికారు. ఈ కార్యక్రమంలో 1104 యూనియన్ ఉమ్మడి జిల్లా కు చెందిన రీజీయన్ అధ్యక్షులు స్వామి, కార్యదర్శి పాండు నాయాక్ ,

అడిషనల్ సెక్రటరీ యాదయ్య గౌడ్, మహబూబ్నగర్ డివిజన్ సెక్రెటరీ శ్రీనివాస్, నారాయణపేట డివిజన్ అధ్యక్షులు మొలప్ప, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, అడిషనల్ సెక్రటరీ రవీంద్ర చారి, డిస్కమ్ కార్యవర్గ సభ్యుడు గోవిందరాజు, కోశాధికారి బండి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు