Miryalaguda : ఏరువాకలో దుక్కి దున్నిన ఎమ్మెల్యే..!
Miryalaguda : ఏరువాకలో దుక్కి దున్నిన ఎమ్మెల్యే..!
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, మన సాక్షి :
రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం వీర్లపాలెంలో ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఏరువాక పౌర్ణమి నిర్వహించారు. పొలంలో దుక్కి దున్ని ఏరువాక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. కర్షకుల పండగ ఏరువాక పౌర్ణమి అని, ప్రకృతిని, భూమిని గౌరవించడం దీని ముఖ్యఉద్దేశ్యమని అన్నారు.
వర్ష రుతువు ఆరంభంలో తొలకరి చినుకు కోసం రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు భూమి పూజ చేస్తారని, నాగలి, ఎద్దులు, ఇతర సేద్యానికి సంబంధించిన పనిముట్లను పూజిస్తారని తెలిపారు. ఇది వ్యవసాయం, ప్రకృతి మధ్య సంబంధాన్ని గుర్తుచేస్తుందని అన్నారు. రైతులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సాయం, మద్దతు ధర ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చల్లా అంజిరెడ్డి, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Nalgonda : చదివింది ఏడవ తరగతి.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టు ఆఫీసర్.. రూ. 17 లక్షలతో పరార్..!
-
Air India plane Crash : గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం.. కుప్ప కూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్..!
-
Miryalaguda : కరాటే లో గోల్డ్ మెడల్ సాధించిన భువనేశ్వర్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభినందనలు..!
-
Miryalaguda : ఐఐటి ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా 29వ ర్యాంక్..!
-
KCR : ముగిసిన కాళేశ్వరం కమిషన్ విచారణ.. కెసిఆర్ ఏం చెప్పారో..!










