TOP STORIESBreaking Newsజాతీయం

WhatsApp : వాట్సాప్ లో ఇక అదిరిపోయే ఫీచర్.. వాయిస్ మెసేజ్ కూడా Textగా, అది ఎలా అంటే..!

WhatsApp : వాట్సాప్ లో ఇక అదిరిపోయే ఫీచర్.. వాయిస్ మెసేజ్ కూడా Textగా, అది ఎలా అంటే..!

మన సాక్షి, ఫీచర్స్ :

వాట్సాప్ వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉన్నారు. వారందరి సౌలభ్యం కోసం వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తుంది. అదే తరహాలో వాట్సప్ సెక్యూరిటీ ఆప్షన్లను కూడా తీసుకొస్తున్న విషయం తెలిసిందే. సరి కొత్తగా మెసేజ్ ట్రాన్స్ స్రిప్ట్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానున్నది.

వాట్సాప్ లో వచ్చే మెసేజ్ లు చూడటం అందరూ చూస్తారు. కానీ వాయిస్ మెసేజ్ లు పంపినప్పుడు ఆ సమయంలో మీటింగ్, ఇతర ప్రాంతాలలో ఉన్నప్పుడు వినలేము. వాయిస్ మెసేజ్ లు అందరికీ ఇష్టం ఉండదు. దాంతో చాలా మంది వాయిస్ మెసేజ్ లు వినరు.

అందుకోసం వాట్సాప్.. యూజర్ల కోసం సరికొత్త రూపంలో కొత్త ఫీచర్ ని తీసుకొస్తుంది. వాయిస్ మెసేజ్ లు వినడం ఇష్టం లేకుండా ఉన్నవారు ట్రాన్స్ స్రిప్ట్ ఉపయోగించి Text రూపంలోకి మార్చుకోవచ్చును. అది ట్రాన్స్ లేటర్ కాదు. వాయిస్ మెసేజ్ ఏ రూపంలో ఉంటుందో ఆ భాషకు Text రూపం ఇస్తుంది. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు వాట్సప్ లోకి వస్తుంది. దానిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది చూద్దాం…

వాయిస్ నోట్స్ చాలా ఈజీగా సెండ్ చేయవచ్చును. ప్రతి ఒక్కరు కూడా వాట్సప్ ఓపెన్ చేసి మైక్ బటన్ ప్రెస్ చేసి చెప్పాలనుకున్నదంతా మాటల్లో చెప్పొచ్చు. ఇదంతా చాలా ఈజీ. అయితే మీరు పంపిన సమయంలో నలుగురిలో ఉన్నప్పుడు మీటింగ్ లో ఉన్నప్పుడు వినడం చాలా కష్టంగా ఉంటుంది. బిజినెస్ కు సంబంధించినవి, పర్సనల్ లైఫ్ కు సంబంధించినవి కూడా ఉంటాయి. అలాంటివి Text రూపంలో అయితేనే చదవడానికి వీలుంటుంది.

అలాంటి ఇబ్బందులను తొలగించడానికి వాట్స్అప్ కొత్త ఫీచర్ ని తీసుకొస్తుంది. ఈ ఫీచర్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. ఈ కొత్త ఫీచర్ తో ఆటోమేటిక్ గా వాయిస్ మెసేజ్ వచ్చిన చోటే ట్రాన్స్క్రిప్ట్ చేయవచ్చును. మీకు వాయిస్ మెసేజ్ వచ్చిన తర్వాత ట్రాన్స్ స్రైబ్ చేసేందుకు దానిని పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.

వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్ చేయాలంటే ఆ ఫైల్ సైజ్ దాదాపు 90MB ఉండాలి. ఇలా డౌన్ లోడ్ చేసిన ఫైల్ మీకు వాయిస్ ఫైల్ కింద కనిపిస్తుంది. వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్… ఫీచర్ ఫోన్లో మాత్రమే ఇది పనిచేస్తుంది. అయితే మీరు వాట్సాప్ సైట్లో ఈ ఫీచర్ ని చూడలేరు. ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్, హిందీ భాషల్లోకి మాత్రమే ఈ ట్రాన్స్క్రిప్షన్ జరిగేలా వాట్సాప్ ఏర్పాటు చేసింది.

ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. అందులో చాట్ పై క్లిక్ చేసి వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్ ఆప్షన్ కు వెళ్లాలి. మీరు ఫీచర్ ని ఆన్ చేసుకుంటే.. ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది. అందులో మీ ప్రైమరీ లాంగ్వేజ్ ని కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది.

మీకు వచ్చిన ప్రతి వాయిస్ కమ్యూనికేషన్ ప్రారంభం నుండి చివరి వరకు ఎన్క్రిప్ట్ అవుతుంది. వాయిస్ ఫైల్ టెక్స్ట్ గా మారే క్రమంలో మీ కన్ఫర్మేషన్ గానీ, మీ డేటా గాని ఎవరికి షేర్ కాదని, ఎక్కడ స్టోర్ అవ్వదని వాట్సప్ యాజమాన్యం చెబుతుంది. అందరికి ఉపయోగపడే ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రావలసి ఉంది. త్వరలో అప్డేట్ చేస్తామని వాట్సప్ ప్రకటించింది.

MOST READ : 

మరిన్ని వార్తలు