Gold Price : తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే..!
Gold Price : తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తగ్గినట్టే తగ్గి బంగారం ధర మళ్లీ భారీగా పెరిగింది. మూడు రోజులపాటు భారీగా తగ్గిన బంగారం ధర శనివారం ఒక్కసారిగా భారీగా పెరిగింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు శనివారం ఒక్కరోజే 6500 రూపాయలు పెరిగింది. 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం కు 6000 రూపాయలు పెరిగింది.
శుక్రవారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 7,68,000 ఉండగా 6500 రూపాయలు పెరిగి శనివారం 7, 74, 500 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ శుక్రవారం 7,04, 000 రూపాయలు ఉండగా 6000 రూపాయలు పెరిగి శనివారం 7,10,000 రూపాయలు ఉంది.
హైదరాబాద్ లో శనివారం తులం బంగారం (10 గ్రాములకు) 24 క్యారెట్ 77,450 రూపాయలు
ఉండగా 22 క్యారెట్ 71,000 రూపాయలు
ఉంది. అయితే తెలుగు రాష్ట్రాలలో కూడా హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే కొనసాగుతున్నాయి. మళ్లీ తులం బంగారం 80,000 రూపాయలకు చేరవచ్చునని మహిళలు భావిస్తున్నారు.
MOST READ :









