Gold Price : వరుసగా రెండో రోజు పడిపోయిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే..!

Gold Price : వరుసగా రెండో రోజు పడిపోయిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసిందే. లక్ష రూపాయలకు తులం బంగారం చేరువ అవుతుందని అందరూ ఊహించగా అకస్మాత్తుగా ధరలు పడిపోతున్నాయి. శనివారం తో వరుసగా రెండవ రోజు కూడా బంగారం ధరలు భారీగా పడిపోయాయి.
శుక్రవారం 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం కు 17,400 ధర పడిపోగా శనివారం వరుసగా రెండవ రోజు కూడా 100 గ్రాముల కు 9800 ధర తగ్గింది. దాంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ మాసంలో శుభకార్యాలు ఉన్నందున బంగారం కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.
హైదరాబాదులో 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం కు శుక్రవారం 8,40,000 రూపాయలు ఉండగా శనివారం 9000 రూపాయలు తగ్గి 8,31,000 రూపాయలకు చేరింది. అదేవిధంగా 24 క్యారెట్స్ బంగారం శుక్రవారం 9,16,400 రూపాయల ధర ఉండగా శనివారం ఒక్కరోజే 9,800 తగ్గి 9,06,600 రూపాయలకు చేరింది.
తులం ఎంతంటే ..?
హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల (తులం) 24 క్యారెట్స్ బంగారం శనివారం 90,660 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 83,100 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ఉన్నాయి.









