Breaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Price : పసిడి ధర తగ్గుదలకు బ్రేక్ లేదు.. మరింత తగ్గిన బంగారం ధర..!

Gold Price : పసిడి ధర తగ్గుదలకు బ్రేక్ లేదు.. మరింత తగ్గిన బంగారం ధర..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ధర రోజురోజుకు తగ్గుతోంది. శుక్రవారంతో పసిడి ధర తగ్గుదలకు బ్రేక్ పడిందని అనిపించినప్పటికీ శనివారం మళ్లీ తగ్గింది. పసిడి ధరలు రోజురోజుకు తగ్గుతుండడంతో మహిళల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. తులం బంగారం లక్ష రూపాయలకు చేరువ అవుతుందని భావించినప్పటికీ కార్తీక మాసం ప్రారంభం నాటి నుంచి తగ్గుదల ప్రారంభమైంది.

వరుసగా బంగారం ధర తగ్గుతూ వస్తుంది. శనివారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 1100 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్స్ బంగారం 1000 రూపాయలు తగ్గింది. తెలుగు రాష్ట్రాలలో 22 క్యారెట్స్ తులం (10 గ్రాముల) బంగారం ధర శనివారం 69,350 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ బంగారం ధర 75,650 రూపాయలుగా ఉంది.

పెళ్లిళ్ల సీజన్ లో ధర తగ్గడంతో బంగారం షాపులు కిటకిటలాడుతున్నాయి. మహిళలు బంగారం కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. మళ్లీ బంగారం ధర పెరుగుతుందేమో అని మహిళలు కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు