NALGONDA : వీరు మామూలోళ్లు కాదు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
NALGONDA : వీరు మామూలోళ్లు కాదు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
నల్లగొండ, మన సాక్షి :
తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవర్ తెలిపారు. మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంగళవారం పక్కా సమాచారంతో నల్లగొండ సిసిఎస్. తిప్పర్తి పోలీసులు సంయుక్తంగా దుప్పలపల్లి ఎక్స్ రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు వెళ్తున్న హోండా యాక్టివా పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పతంగా కనిపించగా వారిని ఆపి విచారించగా వారు పెద్ద సూరారం గ్రామ పరిధిలో గత నెల 30వ తేదీన పగడిపూట ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు.
అలాగే స్కూటీని తనిఖీ చేయగా స్కూటీలో దొంగతనం చేసిన బంగారం ఆభరణాలు అలాగే ఇనుపరాడును స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి బంగారు ఆభరణాలను మిర్యాలగూడలో అమ్మడానికి వెళుతున్నామని పట్టుబడిన నేరస్తులు తెలిపినట్లు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు ముఠాలోని నలుగురు సభ్యులను చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో మరొక నేరస్తుని వలిగొండలో అదుపు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
పట్టుబడిన నేరస్థులు అందరిని విచారించగా నేరస్థులు అందరూ ఒక ముఠాగా ఏర్పడి నల్గొండ జిల్లాలో అలాగే రాచకొండ కమిషనర్ పరిధిలో మొత్తం 12 నెలలు చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నేరాలకు
సంబంధించి 23.53 లక్షల విలువ చేసే 31 బంగారం ఆభరణాలు. కిలో వెండి 28 వేల నగదు అలాగే యాక్టివా స్కూటీ. 4 సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నేరస్తులైన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తికి చెందిన గుండెబోయిన మహేష్, గుండబోయిన మల్లేష్ నూతి సతీష్ అలాగే యాదాద్రి జిల్లా వలిగొండ గ్రామానికి చెందిన బొడిగ అశోక్ పెదకాపత్తికి చెందిన భైరవుని స్వామి గుండెబోయిన చంద్రం తో పాటు మరో నేరస్థుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు .పట్టుబడిన నేరస్తులంతా తాము తయారుచేసిన ఇనుపరాడితో గ్రామాల్లో పట్టణాల్లో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసిరాత్రి పగలు తేడా లేకుండా దొంగతనాలు చేస్తూ పట్టుబడినారని పట్టుబడిన వారు తెలియజేసిన వివరాల ప్రకారం..
నల్గొండ జిల్లాలోని తిప్పర్తి కట్టంగూరు చిట్యాల నార్కట్పల్లి నల్గొండ టు టౌన్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని రామన్నపేట పిఎస్ పరిధిలో మొత్తం 12 నేరాలు చేసినట్లు తెలిపారు. ఇట్టి ముఠా సభ్యులను పట్టుకోవడంలో నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి .నల్గొండ సిసిఎస్ ఇన్స్పెక్టర్ .శాలిగౌరారం ఇన్స్పెక్టర్ కొండల్రెడ్డి. తిప్పర్తి సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ రాజు. విష్ణువర్ధన్. గిరి లింగా.రెడ్డి. వహీద్ భాషా. రాము, శ్రీధర్ రెడ్డి. శ్రీనివాస్ ఇతర సిబ్బంది నేరస్తులను పట్టుకున్నారని వీరి అందర్నీ ఎస్పీ అభినందించారు.
ALSO READ :
మిర్యాలగూడ : రైస్ మిల్లుల్లో విస్తృతంగా మొక్కలు నాటి కాలుష్యాన్ని నియంత్రించాలి..!
Narayanpet : పేటలో బంద్ సంపూర్ణం.. తెరుచుకోని దుకాణాలు, మూతపడిన విద్యా సంస్థలు..!
Independence day : జెండా పండుగ ఎక్కడ.. సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేసేది అక్కడేనా..!










