క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో దొంగల బీభత్సం..!

Nalgonda : నల్గొండ జిల్లాలో దొంగల బీభత్సం..!

దేవరకొండ, మనసాక్షి :

నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు బంగారం నగదు దోచుకెల్లిన ఘటన పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. దేవరకొండ పట్టణంలో గాంధీనగర్ కు చెందిన వావిలికొలను శ్యామ్ సుందర్ రావు ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి దొంగలు వస్తువులను దొంగలించాడని శ్యామ్ సుందరావు అనుమానిస్తున్నాడు. శ్యామ్ సుందర్ రావు నల్లగొండ పట్టణంలో యంజి కాలేజీలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు అన్నారు. ఇంట్లో ఉన్న మూడున్నర తులాల బంగారం, 20 వేల రూపాయలు దొంగలు దొంగలించినట్లు తెలిపారు.

సిఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం… దేవరకొండ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని అన్నారు. ప్రజలు ఊరికి వెళ్లే సమయంలో పోలీస్ వార్డు ఆఫీసర్లకి తెలియజేయాలి, ముఖ్యంగా ఇంటి ముందు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

MOST READ: 

మరిన్ని వార్తలు