TG News : ఇది ట్రయల్ మాత్రమే.. జనవరిలో వాడపల్లి నుంచి పాదయాత్ర, సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన..!
TG News : ఇది ట్రయల్ మాత్రమే.. జనవరిలో వాడపల్లి నుంచి పాదయాత్ర, సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన..!
నల్లగొండ, మనసాక్షి :
ఇది ట్రయల్ మాత్రమేనని, జనవరిలో వాడపల్లి నుండి మూసి పాదయాత్రను ప్రారంభిస్తామని, గోదావరిని మూసి తో కలిపి,మూసి,ఈసా నదులను కృష్ణాలో అనుసంధానించే కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
ఒక్కరోజు యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా తన జన్మదినమైన గురువారం ఆయన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానంతరం వలిగొండ మండలం, సంగెం వద్ద మూసి నది ఒడ్డున ఉన్న భీమలింగం శివయ్యకు పూజలు నిర్వహించి సీఎం రెవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు.
అనంతరం అక్కడే కులవృత్తులు, రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో మూసిలో రూపాయి నాణెం వేస్తే అద్దంలా కనిపించేదని అన్నారు.
అలాంటిది ఇప్పుడు కాలుష్యం పెరిగిపోయి విషయంగా మారిందని, అన్ని వృత్తుల వారు, రైతులు ఎంతో బాధలను అనుభవిస్తున్నారని, మహిళలు గర్భం దాల్చే పరిస్థితి లేదని, ఒకవేళ గర్భం దాల్చిన అంగవైకల్యంతో పిల్లలు జన్మిస్తున్నారని, జపాన్ దేశంలోని హీరోసీమా నాగసాకి పై వేసిన అణు బాంబు కన్నా అత్యంత ప్రమాదకరంగా మూసీ నది తయారైందని అన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ అతిపెద్ద విస్ఫోటనాన్ని మూసి రూపంలో ఎదుర్కోబోతున్నామని తెలిపారు.
మూసీ నది కాలుష్యం వల్ల ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో పంటలు పండే పరిస్థితి లేదని, రైతులకు సాగునీరు, తాగునీరు లేదని, ఒకప్పుడు పాడిపంటలతో కళ కళలాడిన మూసీ ప్రాంతం ఇప్పుడు మురికి కూపంగా మారిందని, ఒకప్పుడు వ్యవసాయం పైన ఆధారపడిన ఈ ప్రాంతం ఇప్పుడు పంటలు పండక, చేతివృత్తులు నడవక, ప్రజలు వలస వెళ్లే పరిస్థితిలు ఏర్పడ్డాయని అన్నారు.
అలాంటి ఈ పరిస్థితిని ప్రజలు ఎదుర్కోకుండా మూసీ నదిని ప్రక్షాళన చేయాలని సంకల్పించి తన జన్మదినం రోజు నుండి పాదయాత్ర ప్రారంభించానని తెలిపారు. అందుకే ముందుగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పూజలు నిర్వహించి సంగెం వద్ద భీమలింగేశ్వరున్ని దర్శించుకుని పాదయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. ఇది ట్రయల్ మాత్రమేనని, జనవరిలో వాడపల్లి నుండి మూసి పాదయాత్రను ప్రారంభిస్తామని, గోదావరిని మూసి తో కలిపి,మూసి,ఈసా నదులను కృష్ణాలో అనుసంధానించే కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలిపారు.
నవంబర్ 8 తన జన్మదినం కాదని, జన్మ ధన్యమైన రోజు అని చెప్పారు. మూసి ప్రక్షాళనకు ఎవరు అడ్డుపడినా బుల్డోజర్లతో తొక్కిస్తామన్నారు.
రెండు కోట్ల రూపాయల వ్యయంతో భీమ లింగం శివయ్య దర్శనానికి అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. 30 రోజుల్లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు డిజైన్లను పూర్తి చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
MOST READ :
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కవల సోదరుడు ఉన్నాడని మీకు తెలుసా.. ఐతే తెలుసుకో..!
-
TG News : తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్టకు బోర్డు ఏర్పాటు.. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశం..!
-
Miryalaguda : మూసి ప్రక్షాళన పేరుతో పేదల ఇల్లు తొలగిస్తే ఊరుకునేది లేదు.. హెచ్చరించిన జూలకంటి..!
-
Gold Price : పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. తెలుగు వారిని ఒక్కరోజే మురిపించింది..!










