తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Rythu : నేల సారం పెంచుకునేందుకు ఇలా చేయాలి.. రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన..!

Rythu : నేల సారం పెంచుకునేందుకు ఇలా చేయాలి.. రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం మంగళవారం నారాయణపేట మండలం వీరప్పల గ్రామంలో నిర్వహించారు. వ్యవసాయ పాలిటెక్నిక్ శాస్త్రవేత్తలు డాక్టర్. ఎం. పరిమళ కుమార్, జే డీ. సరిత ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు సలహాలు, పలు సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా పరిమళ కుమార్, జెడి సరిత మాట్లాడుతూ రైతులు ఎత్తిన ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేలైన విత్తన రకాల గురించి వివరించారు. వంట మార్పిడి పద్ధతిని అవలంబించడం ద్వారా నేల సారం పెరగడంతో పాటు అధిక లాభాలు పొందవచ్చు అని తెలిపారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.

ప్రత్యామ్నాయ మార్గాలైన పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు, జీవ కీటక మరియు శిలీంద్ర నాసినీలను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో బాల దినాకర్, ఏఈవోలు ప్రకాష్, అనిల్ కుమార్, అంజమ్మ, రైతులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Power Cut : నేడు విద్యుత్ కోత.. ఇవీ వేళలు..!

  2. Suryapet : పాలిసెట్ లో శ్రీజ కు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్.. అభినందించిన జిల్లా ఎస్పీ..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త..!

  4. District SP : రైతులకు జిల్లా ఎస్పీ కీలక సూచన.. భూతగాదాలు ఉంటే అలా పరిష్కరించుకోవాలి..!

  5. Seeds : నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా.. విత్తనాలు కొనే ముందు రైతులు ఏం చేయాలి..!

మరిన్ని వార్తలు