Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మిర్యాలగూడ : ప్రేమ పేరుతో వేధించి యువతి ఆత్మహత్యకు కారకులైన వారు అరెస్ట్, రిమాండ్..!

మిర్యాలగూడ : ప్రేమ పేరుతో వేధించి యువతి ఆత్మహత్యకు కారకులైన వారు అరెస్ట్, రిమాండ్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ప్రేమ పేరుతో ఓ యువతిని వేధించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో ఇరువురు యువకులను శుక్రవారం మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మిర్యాలగూడలోని డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పి రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం. మాడుగుల పల్లి మండలం కుక్కడం గ్రామానికి చెందిన ఓ యువతి ఈ నెల ఆరవ తేదీన పురుగుల మందు గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.

కాగా 8వ తేదీన ఆమె వాంగ్మూలం ప్రకారం ఇరువురి వేధింపులకు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియజేసింది. అదే గ్రామానికి చెందిన మధుకర్, శివ అనే వారు వేధింపులకు పాల్పడినట్లు ఆమె తెలియజేసింది. ఆమె ఈ నెల 9వ తేదీన చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా ఆ యువతి ఆత్మహత్యకు కారకులైన ఇద్దరిని నార్కట్పల్లి వద్ద జాతీయ రహదారిపై అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు డి.ఎస్.పి తెలిపారు.

ఆడపిల్లలకు ఇటువంటి సమస్య ఎదురైతే ఉన్నతాధికారులకు తెలియజేయాలని కోరారు. వారు కానీ పేరెంట్స్ కానీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లయితే గోప్యత పాటించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆడపిల్లలను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా కూడా చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని, ఈ కేసు విషయంలో అరెస్టు చేసిన వారిద్దరికీ కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు, మాడుగుల పల్లి ఎస్ఐ తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి : 

Good News : ప్రయాణికులకు TGSRTC శుభవార్త.. ఇకపై తొలగనున్న కష్టాలు..!

Ration Shops : మిర్యాలగూడలో రేషన్ దుకాణాల ఆకస్మిక తనిఖీ.. డీలర్ పై కేసు నమోదు..!

మరిన్ని వార్తలు