Urea : యూరియా కోసం బారులు తీరిన వేలాది మంది రైతులు..!

Urea : యూరియా కోసం బారులు తీరిన వేలాది మంది రైతులు..!
తిరుమలగిరి (సాగర్), మనసాక్షి :
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొత్తపెళ్లి హాలియా గోదం దగ్గర యూరియా కోసం రైతులు బారులు తీరారు. గత కొన్ని రోజులుగా నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా యూరియా కొరత ఉండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
తిండి తిప్పల లేకుండా క్యూలైన్లో రోజు మొత్తం నిలబడ్డ యూరియా దొరకని పరిస్థితి ఏర్పడింది. పొలాలు నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్న యూరియా చల్లలేకపోతున్నామని రైతులు అంటున్నారు.
ఒక్కొక్కరికి రెండు బస్తాలు చొప్పున ఇచ్చేందుకే అతి కష్టంగా మారింది అని అంటున్నారు. సన్న పెద్ద కారు రైతులకు యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగైతే మున్ముందు వ్యవసాయం చేయడం చాలా కష్టంగా మారుతుంది అని అంటున్నారు. గత ప్రభుత్వంలో హయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులో ఉండేదని అంటున్నారు.
ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని రైతులు పడే బాధలను చూసి వారికి యూరియా తొందరగా అందించవలసిందిగా కోరుతున్నారు.
MOST READ :
-
Dammapeta : దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారి ముంచెత్తిన వరద.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..!
-
Pro Kabaddi : ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12కు ఎంపికైన టీచర్.. ఎవరో తెలుసా..!
-
Pro Kabaddi : ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12కు ఎంపికైన టీచర్.. ఎవరో తెలుసా..!
-
Heavy Rain : ప్రమాద స్థాయిలో కప్పలవాగు ప్రవాహం.. భీంగల్ లో భారీ వరద ఉధృతి..!
-
Horticulture : రైతులకు భారీ శుభవార్త.. వారికి ఎకరానికి రూ.8వేలు సబ్సిడీ..!









