తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుములుగు జిల్లా

గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్..!

గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్..!

మంగపేట, మన సాక్షి :

గంజాయి తరలిస్తున్న ముగ్గురుని పట్టుకొని వారి నుంచి 63 వేల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఏటూరు నాగారం సిఐ ఏనుముల శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్ సూరి తెలిపారు.

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ఆంజనేయస్వామి గుడి దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు కదలికలు అనుమాన స్పదంగా ఉండడంతో వారిని విచారించగా వారు మొరం కుమార్ (25) వాజేడు మండలం, వావిలాల సంతోష్ (24)  వెంకటాపురం మండలం, నరందాసరి ప్రవీణ్ కుమార్, (19) వెంకటాపురం మండలం, అని తెలిపారు.

వారి దగ్గర ఉన్న బ్యాగు చెక్ చేయగా దాంట్లో 2.5 కేజీ కిలోల గంజాయిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకీ పంపినట్టు తెలిపారు. 63,వేలు ఉంటుందని తెలిపారు గంజాయి పట్టుకున్న పోలీసు అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా సీఐ. శ్రీనివాస్, మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస అవుతున్నారని తల్లిదండ్రులు వారిని గుర్తించి సరైన మార్గంలో పయాణిస్తే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

గంజాయి అమ్మిన సేవించిన కఠిన చర్యలు తప్పవని గంజాయి అమ్మకాలు రావాణ చేసేవారి వివరాలు తెలిపిన వారికి భారీ పారితోషికం ఇవ్వడం జరుగుతుందన్నారు. వివరాలు కూడా గొప్పంగా ముంచడం జరుగుతుందని సీఐ. శ్రీనివాస్, తెలిపారు. సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ చుక్కయ్య, కానిస్టేబుల్ మోహన్, ప్రసాద్, చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా కు కావల్సినవి ఇవే.. వారికే పంట సహాయం.. లేటెస్ట్ అప్డేట్..!

  2. TG News : పింఛన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. త్వరలో అర్హుల ఎంపిక..!

  3. TG News : పింఛన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. త్వరలో అర్హుల ఎంపిక..!

  4. IBomma : ఐ బొమ్మలో కొత్త సినిమాలు.. ఫ్రీగా చూడొచ్చు.. అసలు మిస్ కావొద్దు..!

  5. Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తులకు ఇదే చివరి తేదీ.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు